టీడీపీని ముందుపెట్టి బీజేపీ రాజకీయం... జగ్గారెడ్డి

టీడీపీని ముందుపెట్టి బీజేపీ రాజకీయం... జగ్గారెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీడీపీని ముందు పెట్టి బీజేపీ రాజకీయం మొదలుపెట్టిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. ఏపీలో ఆడిన పొలిటికల్ గేమ్ తెలంగాణలోనూ అమలు చేసి, కాంగ్రెస్​ను దెబ్బతీసేందుకు బీజేపీ ఎత్తుగడ వేస్తోందన్నారు. అందులో భాగంగానే చంద్రబాబు పావుగా మారారని, తమ ప్రభుత్వంలో వాళ్ల ప్లాన్లు వర్కౌట్​ కావన్నారు. సోమవారం గాంధీ భవన్​లో మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడారు.

విభజన సమస్యల పరిష్కారం పేరుతో చంద్రబాబు ఎంటర్ అయ్యారని, బీజేపీ డైరెక్షన్​లో చంద్రబాబు, పవన్​ కల్యాణ్ పనిచేస్తున్నారని ఆరోపించారు.  ఈడీ, సీబీఐ వల్ల బీజేపీ అధికారం లోకి వచ్చిందని, లేకపోతే రాహుల్ ప్రధాని అయ్యేవారని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఐటీ కి పునాది వేసింది మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అయితే, ఆయన ప్రణాళికను నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముందుకు తీసుకెళ్లారని చెప్పారు.