దుబాయ్​లో జగిత్యాలవాసి ఆత్మహత్య

దుబాయ్​లో జగిత్యాలవాసి ఆత్మహత్య

రాయికల్, వెలుగు: జగిత్యాల జిల్లా రాయికల్ మండలానికి చెందిన వ్యక్తి దుబాయ్ లో ఆత్మహత్యకు  పాల్పడ్డాడు. మండలంలోని  కట్కాపూర్  గ్రామానికి చెందిన భూమయ్య(43) కొద్ది నెలల క్రితం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు.  ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. కంపెనీ యజమాన్యం కొన్ని నెలలుగా జీతం ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురైన భూమయ్య గురువారం గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు దుబాయ్ నుంచి ఆయన ఫ్రెండ్స్​కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రభుత్వం, నాయకులు స్పందించి  స్వగ్రామానికి మృతదేహం  తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.