
పాకిస్తాన్ ను దెబ్బకొట్టాలంటే ముందుగా చేయాల్సింది ఏంటీ.. అష్ఠదిగ్బంధనం.. అవును.. ఇప్పుడు ఇదే చేస్తోంది ఇండియా. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ.. పాకిస్తాన్ దేశానికి సంబంధించిన అన్ని వ్యవస్థలను అష్ట దిగ్బంధనం చేస్తోంది. ఇందులో భాగంగా పాకిస్తాన్ విమానాలు ఏవీ భారత్ గగనతలంలోకి రాకుండా నిషేధం విధించింది. ఇంతటితో ఆగలేదు భారత్.. సిగ్నల్స్ జామ్ చేస్తూ.. పాక్ సిగ్నల్ వ్యవస్థ పని చేయకుండా జామర్లు ఏర్పాటు చేస్తోంది.
ఇండియా, పాకిస్తాన్ సరిహద్దుల్లో భారత్ ఇప్పటికే ఈ దిశగా జామర్లు ఏర్పాటు చేసింది. 2025, ఏప్రిల్ 30 నుంచి మే 23వ తేదీ వరకు పాక్ విమానాలు భారత్ ఎయిర్ స్పేస్ లోకి రాకుండా బ్యాన్ విధించింది. అందులో భాగంగానే ఈ జామర్లను ఏర్పాటు చేసింది. పాకిస్తాన్ సైనిక విమానాల నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ను పని చేయకుండా చేయటమే భారత్ లక్ష్యంగా తీసుకున్న ఈ చర్యతో.. ఇప్పుడు పాక్ అల్లకల్లోలంగా మారింది.
పాకిస్తాన్ సైనిక విమానాలు ఉపయోగించే చైనాకు చెందిన బీడై, రష్యాకు చెందిన గ్లోనాస్, అమెరికాకు చెందిన జీపీఎస్ వంటి శాటిలైట్ ఆధారిత నావిగేషన్ సిస్టమ్ ను.. భారత్ ఏర్పాటు చేసిన జామర్లు అడ్డుకుంటున్నాయి. దీంతో పాక్ విమానాలు, సైనిక విమానాలు పొరపాటున కూడా భారత్ గగనతలంలోకి వచ్చాయంటే సిగ్నల్స్ లేక తికమకపడి.. ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి.
Also Read:-ఎవరీ అసిమ్ మాలిక్.. పాకిస్తాన్ కొత్త ఎన్ఎస్ఏ, ఐఎస్ఐ చీఫ్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి..
జమ్మూకాశ్మీర్ పహల్గాంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు.. మన టూరిస్టులు 28 మందిని చంపిన ఘటన తర్వాత.. భారత్ రోజుకో రకంగా పాకిస్తాన్ పై ఆంక్షలు విధిస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే ఈ జామర్ల ఏర్పాటు.. భారత్ ఎయిర్ స్పేస్ మూసివేత జరిగింది. సింధు జలాల ఒప్పందాన్ని సైతం నిలిపివేసి.. నీటిని బంద్ చేసింది. పాకిస్తాన్ పౌరుల వీసాలు రద్దు చేసింది. వెనక్కి పంపించింది.
భారత్ తీసుకుంటున్న చర్యలతో పాకిస్తాన్ అష్టదిగ్బంధంలోకి వెళుతుంది. ఏం చేయాలో అర్థం కాక తికమకపడుతూ.. సన్నాయి నొక్కులు నొక్కుతుంది. భారత్ ఎయిర్ స్పేస్ మూసివేతతో.. పాకిస్తాన్ విమానాలు మరో మార్గంలో ప్రయాణించాల్సి ఉంది. ఇది ఆర్థికంగా పాకిస్తాన్ కు చాలా చాలా తీవ్రమైన నష్టమే.