
న్యూఢిల్లీ: ఆధార్, పాన్, రేషన్ కార్డులు భారత పౌరసత్వానికి ఖచ్చితమైన రుజువులు కాదని కేంద్రం స్పష్టం చేసింది. జనన, నివాస ధ్రువీకరణ పత్రాలు మాత్రమే సిటిజన్ షిప్ నిర్ధారణకు చెల్లుబాటవుతాయని పేర్కొంది. ఆధార్, పాన్ కేవలం వ్యక్తిగత గుర్తింపును మాత్రమే నిర్ధారిస్తాయని చెప్పింది.
అనేకమంది అక్రమంగా మనదేశంలోకి వచ్చి ఆధార్, రేషన్, పాన్ కార్డులు పొంది సిటిజన్ షిప్ కోసం అప్లికేషన్ చేసుకుంటున్నట్లు గుర్తించిన తర్వాత ఈ సూచనలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. ‘ఆధార్, పాన్‌తోపాటు రేషన్ కార్డు పరిపాలనా, సంక్షేమ అవసరాలకు పనికొస్తాయి. ఇవేవీ సిటిజన్‌షిప్‌ను నిర్ధారించలేవు. ఇలాంటి ఐడెంటిటీ కార్డులను చూసి ఇండియన్ సిటిజన్‌షిప్‌ను ధ్రువీకరించలేం.
సిటిజన్‌షిప్ పొందేందుకు నివాస, బర్త్ సర్టిఫికెట్లనే ప్రాథమిక ఎవిడెన్స్‌లుగా పరిగణిస్తాం కాబట్టి ప్రజలంతా వాటిని కలిగిఉండటం ముఖ్యం. ఒకవేళ బర్త్ సర్టిఫికెట్ లేనివారు, నివాస ధ్రువీకరణ పత్రాన్ని ఉపయోగించవచ్చు’ అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.