కులగణన సమస్యలపై మంత్రుల కమిటీ వేయాలి: సీఎం రేవంత్

కులగణన సమస్యలపై మంత్రుల కమిటీ వేయాలి: సీఎం రేవంత్

దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కులగణన చేయాలని నిర్ణయించినందుకు ప్రధానికి అభినందనలు తెలిపారు సీఎం రేవంత్. కులగణనపై తాము రాజకీయాలు చేయడంలేదని అన్నారు. వివిధ రాష్ట్రాల్లో కులాల రిజర్వేషన్లు వేర్వేరుగా ఉన్నాయని.. కులగణన సమస్యలపై మంత్రుల కమిటీ వేయాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్.

కులగణనలో తెలంగాణ దేశానికే ఆదర్శమని అన్నారు. 57 ప్రశ్నలతో శాస్త్రీయంగా కులగణన చేశామని.. ఆఫీసులో ఉండి కులగణన చేయలేదని అన్నారు. కులగణన కోసం 95 వేల మంది ఎన్యుమరేటర్లను నియమించామని.. ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించారని అన్నారు. కులగణనలో పాల్గొననివారికి రెండోసారి అవకాశం ఇచ్చామని అన్నారు. నిజాయితీగా కులగణన చేశామని అన్నారు సీఎం రేవంత్.

►ALSO READ | సాదాబైనామా భూములకు పాస్​బుక్​లు

కులగణనపై రాష్ట్రాలతో సంప్రదించాలని అన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ ఇదే చెప్పారని అన్నారు. తెలంగాణాలో అధికారంలోకి రాగానే కులగణన చేపట్టామని.. దేశమంతా కులగణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేశామని అన్నారు.సీఎం హోదాలో చాలా సార్లు కుల గణన పై ఎప్పటికప్పుడు సమీక్ష చేశానని.. మూడు నెలల్లో సర్వే పూర్తి చేశామని అన్నారు. ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా కులగణన పూర్తి చేశామని అన్నారు సీఎం రేవంత్.