V6 News

బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి : బీసీ జేఏసీ చైర్మన్ జాజుల 

బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి : బీసీ జేఏసీ చైర్మన్ జాజుల 

ట్యాంక్ బండ్, వెలుగు: జనాభా దామాషా ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు సరైన వాటా దక్కాలంటే బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్ జల సౌద వద్ద బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ అధ్యక్షతన నూతన కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. కార్యక్రమానికి జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరై నూతన కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు.

ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు రాజ్యాంగాన్ని సవరించి ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించిన విధంగానే బీసీ ఉద్యోగులు కూడా కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పోస్టింగులు, బదిలీలలు, కీలక శాఖ హెచ్​వోడీల్లో బీసీ ఉద్యోగులకు ప్రాధాన్యం కల్పించాలన్నారు. బీసీ ఉద్యోగులపై ఏసీబీ పేరుతో వేధింపులు ఆపాలని, బీసీ ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపుని ఇవ్వాలని డిమాండ్ చేశారు.