ఓబీసీ కాలమ్ చేర్చే వరకు పోరాటం : బీసీ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్

ఓబీసీ కాలమ్ చేర్చే వరకు పోరాటం :  బీసీ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: జనగణన ప్రశ్నావళిలో ఓబీసీ కాలమ్ చేర్చే వరకు కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. బీసీ కులాల లెక్కలు తీయాలని దేశవ్యాప్తంగా గత 6 నెలలుగా ఉద్యమిస్తుంటే కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఓబీసీ కాలమ్​ చేర్చాలనే డిమాండ్ తో గురువారం ఢిల్లీలోని కాన్సిట్యూషన్ క్లబ్ లో జాతీయ స్ధాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు బుధవారం ప్రకటనలో తెలిపారు. 

ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడితే స్పందించకపోతే ఎలా అని  ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నప్పటికీ బీజేపీలోని బీసీ నేతలు మౌనం వహించడం దారుణమన్నారు. ఇప్పటికైనా ఆ పార్టీలోని బీసీ నేతలు ప్రధాని మోదీని కలిసి ప్రశ్నావలిలో ఓబీసీ కాలమ్​ చేర్చే విధంగా కృషి చేయాలని, లేదంటే చరిత్రలో బీసీ ద్రోహులుగా మిగిలి పోతారని హెచ్చరించారు. ఢిల్లీలో జరిగే జాతీయ సమావేశానికి 29 రాష్ట్రాల ప్రతినిధులు హాజరుకానున్నట్లు వెల్లడించారు.