శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని కిష్టావర్ జిల్లా ఛత్రు ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున భద్రతా బలగాలు, టెర్రరిస్టుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఛత్రు ప్రాంతంలో టెర్రరిస్టులు ఉన్నట్టు పక్కా సమాచారం అందడంతో జమ్మూకాశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) సంయుక్తంగా ‘ఆపరేషన్ ఛత్రు’ చేపట్టాయి. కలబాన్ అడవుల్లో పాకిస్తాన్కు చెందిన ముగ్గురు టెర్రరిస్టులు ఉన్నట్టు సమాచారం అందడంతో ఇండియన్ ఆర్మీ, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, వైట్ నైట్ కోర్ జాయింట్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.
ఉదయం 5 గంటల సమయంలో టెర్రరిస్టులను భద్రతా బలగాలు గుర్తించాయి. భద్రతా బలగాలు టెర్రరిస్టుల స్థావరం దగ్గరకు చేరుకున్న వెంటనే కాల్పులు ప్రారంభించారు. భద్రతా బలగాలు టెర్రరిస్టుల స్థావరాన్ని చుట్టుముట్టి ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఓ సోల్జర్ తీవ్రంగా గాయపడగా.. అతన్ని హెలికాప్టర్లో ఉధంపూర్లోని ఆస్పత్రికి తరలించినట్టు తెలిసింది.
