అటు పాక్ మోటార్ షెల్స్…ఇటు కరోనా రెడ్ జోన్

అటు పాక్ మోటార్ షెల్స్…ఇటు కరోనా రెడ్ జోన్

శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్ లోని బార్డర్ జిల్లా కుప్వారా లో పలు గ్రామాల్లో విషాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు పాకిస్తాన్ మోటార్ షెల్స్ తో దాడులు చేస్తుండగా వాటి నుంచి తప్పించుకొనే వేరే గ్రామాల్లోకి వెళ్దామంటే కరోనా రెడ్ జోన్ తో వారిని అక్కడికి అనుమతించటం లేదు. సోమవారం రాత్రి పాక్ సైన్యం పలు గ్రామాలపై మోటార్ షెల్స్ తో దాడులకు తెగబడింది. ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలంతా ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. దాడులు అలాగే కొనసాగటంతో దగ్గర్లోని గ్రామాల్లో ఆశ్రయం కోసం వెళ్లగా పోలీసులు వారిని అనుమతించలేదు. కరోనా కారణంగా ఆయా గ్రామాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. ప్రాణాలు రక్షించేకునే మార్గం లేక జనం చెట్లు, కొండ ప్రాంతాల్లో దాక్కున్నారు. అయినప్పటికీ ఓ చిన్నారి సహా ముగ్గురు వ్యక్తులు దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు గాయపడ్డారు. మోటార్ షెల్స్ ఆటాక్ లో గ్రామస్తుల ఇళ్లను పూర్తిగా ధ్వంసమయ్యాయి. ” ఒక్కసారిగా బాంబుల సౌండ్ రావటంతో చెప్పుల కూడా వేసుకోకుండా బయటకు ఉరికాం. దగ్గర్లోని గ్రామాల్లో కరోనా రెడ్ జోన్ అంటూ మమ్మల్ని అనుమతించలేదు. రాత్రంతా కొండలు, చెట్ల చాటుకు దాక్కొన్నాం. మా ఇళ్లన్నీ నాశనమయ్యాయి. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి ” అని ఓ గ్రామస్తుడు కోరారు.