
శ్రీనగర్: జమ్మూ - శ్రీనగర్ జాతీయ రహదారిపై రెండు సొరంగాలను కలిపే రోడ్డు కొట్టుకపోయింది. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో రోడ్డు ఒకవైపు మొత్తం లోయలోకి కుప్పకూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, రోడ్డును క్లియర్ చేసేందుకు పనులు కొనసాగిస్తున్నామని అధికారులు తెలిపారు.
పునరుద్ధరణ పనులు పూర్తయ్యే దాకా ప్రజలు హైవేపై ప్రయాణించొద్దని సూచించారు. కాశ్మీర్ లోయను మిగతా దేశంతో జమ్మూ - శ్రీనగర్ హైవే కలుపుతుంది. మరోవైపు ఆదివారం వరకు జమ్మూకాశ్మీర్ అంతటా ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.