కాంగ్రెస్ ప్రతిష్ట కోసం పనిచేస్తా: జానారెడ్డి

కాంగ్రెస్ ప్రతిష్ట కోసం పనిచేస్తా: జానారెడ్డి

ఇటీవల జరిగిన నల్లగొండ జిల్లా నిరుద్యోగ గర్జనతో కాంగ్రెస్ పార్టీకి మంచి మైలేజ్ వచ్చిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. మే 4వ తేదీ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. దళితులు, మైనార్టీ ముస్లింలు, ఇతర పేదవారు, యూత్ అంతా ఏకమై కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. మొన్న పీసీసీ యాత్రలో అన్ని ఏర్పాట్లు చేసిన వారికి తగిన గౌరవం దక్కలేదని.. ఈ విషయం తన ద్రుష్టి కి వచ్చిందని జానారెడ్డి తెలిపారు. చెరుకు సుధాకర్, దుబ్బాక నరసింహారెడ్డి, కైలాష్ నేత, కొండేటి మల్లయ్య లాంటి వాళ్ళు కాంగ్రెస్ కోసం చాలా వర్క్ చేశారని గుర్తు చేశారాయన. పార్టీలో భేదాభిప్రాయాలు ఉంటే పార్టీలో చర్చించుకోవాలి..కానీ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులను ఏకతాటిపై తీసుకురావడానికి అందరూ పని చేయాలన్నారు జానారెడ్డి.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 8వ తేదీ ప్రియాంక గాంధీ హైదరాబాద్ కి వస్తున్నారని చెప్పారు జానారెడ్డి. పార్టీ కార్యదర్శి హోదాలో నిరుద్యోగ సమస్యను ముందుకు తీసుకుపోవడానికి, ప్రభుత్వన్ని నిలదీయడం కోసం ప్రియాంక గాంధీ వస్తున్నారని తెలిపారాయన. విద్యార్థులను, నిరుద్యోగులను చైతన్య పరచడం కోసం ప్రియాంక గాంధీ తెలంగాణలో నిర్వహిస్తున్న మొదటి పార్టీ మీటింగ్ ఇది.. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట అనేలా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. 

తాను కాంగ్రెస్ ప్రతిష్ట కోసం పనిచేస్తానని జానారెడ్డి వెల్లడించారు. ఇక బట్టి విక్రమార్క యాత్రకు కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు స్వాగతం పలుకుతున్నారని..తాను కూడా బట్టి యాత్రలో పాల్గొని స్వాగతం తెలుపుతానన్నారు జానారెడ్డి. బడుగుబలహీన వర్గాల సపోర్ట్ తోనే అన్ని పార్టీలు, ప్రభుత్వం పాలన సాగుతుందని జానారెడ్డి పేర్కొన్నారు.