- మద్యాన్ని నిషేధిస్తున్న కొత్త పాలకవర్గాలు
- జనగామ జిల్లాలో పలు పంచాయతీల్లో అమలు
- అదే బాటలో మరికొన్ని గ్రామాల్లో బంద్ కు రెడీ
బచ్చన్నపేట, వెలుగు: పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు మద్యం అమ్మకాలను నిషేధిస్తున్నాయి. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని నారాయణపూర్పాలకవర్గం ముందుగా బెల్టు షాపుల్లో మద్యం అమ్మకాలు బంద్ చేయించింది. అదే బాటలో బుధవారం చిన్నరామచర్లలో సర్పంచ్ఎండీ ఆజాం అధ్యక్షతన గ్రామ సభ ఏర్పాటై.. ఫిబ్రవరి 1 నుంచి మద్యం అమ్మకాలు బంద్చేసేందుకు తీర్మానించింది.
పర్యవేక్షణకు సర్పంచ్ఆజాం చైర్మన్‌గా, ఉప సర్పంచ్కంత్రి యాదయ్య వైస్‌చైర్మన్‌గా, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు సభ్యులుగా మద్యనిషేధ కమిటీ ఏర్పాటు చేశారు. మద్యం అమ్మినవారికి రూ. 1లక్ష జరిమానా, పట్టించినవారికి రూ. 10వేలు నజరానాను ప్రకటించారు.
మద్యాన్ని నిషేధించేందుకు బండ నాగారం, కొడువటూరు, వీఎస్ఆర్నగర్పంచాయతీలు కూడా రెడీ అయ్యాయి. గ్రామాల్లో కొందరు యువత ఉదయం, సాయంత్రం తాగుతూ మద్యం మత్తులో గొడవలు పడుతున్నారు. దీంతో సర్పంచ్‌లు ఆలోచన చేసి మద్యాన్ని బంద్ చేసేందుకునిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోవైపు మద్య నిషేధంపై యువకులు మండిపడుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం మద్యం పంచి, ఇప్పుడు నిషేధిస్తామంటే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు.
