ఇది టాలెంట్ అంటే: ప్రభుత్వ స్కీమ్ పేరుతో ఎమ్మెల్యేనే మోసం చేసిన సైబర్ నేరగాళ్లు

ఇది టాలెంట్ అంటే: ప్రభుత్వ స్కీమ్ పేరుతో ఎమ్మెల్యేనే మోసం చేసిన సైబర్ నేరగాళ్లు

ఆయనో నియోజకవర్గ ఎమ్మెల్యే. ప్రభుత్వ పథకాల గురించి స్పష్టమైన అవగాహన ఉంటుంది. గవర్నమెంట్ స్కీములను ప్రజల్లోకి తీసుకెళ్లి.. వారికి ఆ పథకం అర్హతలు, ప్రయోజనాలు వంటి వివరాలను డిటెయిల్డ్‎గా ఎక్స్‎ప్లేయిన్ చేయాలి. అలాంటి ఎమ్మెల్యే ప్రభుత్వ పథకాల విషయంలో సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. సైబర్ కేటుగాళ్ల మాయమాటలు నమ్మి ఏకంగా లక్ష రూపాయలు పొగొట్టుకున్నారు. చివరకు మోసపోయానని గ్రహించి చేసేదేమి లేక సదరు ఎమ్మెల్యే పోలీసులను ఆశ్రయించారు.

ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ఆ ఎమ్మెల్యేకు ఏకంగా రాష్ట్రంలో యూనివర్శిటీలు ఉండటం. వర్శిటీలు నడిపే ఆ ఎమ్మెల్యే ఇంత ఈజీగా సైబర్ నేరగాళ్లు ఉచ్చులో పడి డబ్బులు ఎలా పొగుట్టుకున్నారనేది చర్చనీయాంశంగా మారింది. మరీ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ఆ ఎమ్మెల్యే ఎవరు..? ఎలా మోసపోయారో తెలుసుకుందాం.. 

బీఆర్ఎస్ సీనియర్ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. కేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో ఎమ్మెల్యేను మోసం చేశారు కేటుగాళ్లు. అపరిచిత ఫోన్ కాల్ ద్వారా తెలంగాణ ఆర్థికశాఖలో అదనపు కార్యదర్శి అంటూ పరిచయం చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా  వికసిత్ భారత్ పథకం ప్రారంభించిందని.. అర్హుల జాబితా పంపిస్తే ఒక్కొ లబ్దిదారుడికి రూ.10 లక్షల రుణాలు ఇస్తామంటూ ఎమ్మెల్యేను నమ్మించారు కేటుగాళ్లు. అయితే.. స్కీమ్ ప్రాసెసింగ్ ఫీజు కింద ఒక్కొక్కరికి రూ.2500 ఖర్చు అవుతుందని చెప్పారు.

 పథకం నిజమేనని నమ్మిన ఎమ్మెల్యే పల్లా లక్ష రూపాయలు ఫోన్ ద్వారా సైబర్ నేరగాళ్లకు పంపాడు. నిందితులను మళ్లీ డబ్బులు అడగగా ఉలుకు లేదు పలుకు లేదు. దీంతో మోసపోయానని గ్రహించిన ఎమ్మెల్యే పల్లా వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పల్లా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

పల్లా వంటి ఎడ్యుకేటేడ్ పర్సన్ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవడం అది కూడా మళ్లీ గవర్నమెంట్ స్కీమ్‎కు సంబంధించి కావడం చర్చనీయాశంగా మారింది. ఎమ్మెల్యే పల్లా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయాడనే విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఇది టాలెంట్ అంటే.. ప్రభుత్వం పేరుతో ఎమ్మెల్యేనే మోసం చేశారని కామెంట్స్ చేస్తున్నారు. 

..