కల్వర్టును ఢీకొట్టిన లారీ.. డ్రైవర్ మృతి, క్లీనర్కు గాయాలు..జనగామ, సిద్దిపేట హైవేపై ఘటన

కల్వర్టును ఢీకొట్టిన లారీ.. డ్రైవర్ మృతి, క్లీనర్కు గాయాలు..జనగామ, సిద్దిపేట హైవేపై ఘటన

చేర్యాల, వెలుగు: జనగామ, సిద్దిపేట హైవేపై కల్వర్టును లారీ ఢీకొట్టడంతో డ్రైవర్​చనిపోగా, క్లీనర్​కు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూర్​ నుంచి సిరిసిల్ల కు సబ్బులు, సర్ఫ్​ లోడ్​తో వస్తున్న లారీ వీరన్నపేట స్టేజి వద్ద కల్వర్టును ఢీకొట్టి పల్టీ కొట్టింది. 

లారీ డ్రైవర్​ షేక్​ మౌలాలి(51)పై లారీ క్యాబిన్​ పడడంతో అక్కడికక్కడే చనిపోయాడు. క్లీనర్​ కరీముల్లాకు తీవ్రగాయాలవగా, చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిద్రమత్తులో ఉండడంతోనే లారీ అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టినట్లు భావిస్తున్నారు. మృతుడి బంధువు జానీ బాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అపూర్వారెడ్డి తెలిపారు.