
బీజేపీతో పొత్తులో భాగంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 8 మంది అభ్యర్థులను ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. బీజేపీ ఇప్పటికే 100 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా కొన్ని స్థానాలపై చర్చలు జరుగుతున్నాయి. ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో ఒకసారి చూద్దాం.
8 మంది అభ్యర్థులు వీళ్లే..
- కూకట్ పల్లి : ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్
- తాండూరు: నేమూరి శంకర్ గౌడ్
- కోదాడ: మేకల సతీష్ రెడ్డి
- నాగర్ కర్నూల్: వంగ లక్ష్మణ్ గౌడ్
- ఖమ్మం: మిర్యాల రామకృష్ణ
- కొత్తగూడెం: లక్కినేని సురేందర్ రావు
- వైరా : తేజావత్ సంపత్ నాయక్
- అశ్వరావు పేట : ముయబోయిన ఉమాదేవి
ఇవాళ ఎల్బీ స్టేడియంలో జరిగిన బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధానితో పాటు పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు. దేశానికి మోదీ అనుభవం ఎంతో అవసరం అని.. సీఎంగా, పీఎంగా ఆయన నిర్ణయాలు దేశానికి మార్గనిర్దేశం అయ్యాయన్నారు పవన్ కల్యాణ్. ఆర్టికల్ 370, ట్రిబుల్ తలాఖ్, మహిళా బిల్లు, రామ మందిరం, నోట్ల రద్దు వంటి ఎన్నో సంచలన నిర్ణయాలను దేశం కోసం తీసుకున్న వ్యక్తి మోదీ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. దేశ ప్రయోజనాలే లక్ష్యంగా.. ప్రధాని మోదీ పని చేస్తున్నారని.. అందుకే ఆయన అంటే ఎంతో ఇష్టం అన్నారు పవన్ కల్యాణ్