పోలీసుల అదుపులోకి జనశక్తి అగ్రనేత కూర రాజన్న

 పోలీసుల అదుపులోకి జనశక్తి అగ్రనేత కూర రాజన్న

జనశక్తి అగ్రనేత కూర రాజన్న అలియాస్ KRను నిన్న హైదరాబాద్ లో వేములవాడ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన విషయాన్ని పోలీసులు అత్యంగా గోప్యంగా ఉంచారు. ఇటివల జిల్లాలో జరిగిన వరుస ఘటనలతో అలర్ట్ అయిన పోలీసులు రాజన్నను అదుపులోకి తీసుకున్నారు. 2013లో జరిగిన హత్యకేసులో రాజన్న నిందితుడిగా కూడా ఉన్నాడు. గతంలో జనశక్తి పార్టీకి కేంద్ర కమిటీ కార్యదర్శిగా పనిచేశారు.

అయితే జనశక్తి ప్రాబల్యం తగ్గిపోవడం, హెల్త్ ఇష్యూలతో రాజన్న హైదరాబాద్ లోనే ఉంటున్నారు. హైడ్రామా మధ్య రాజన్నను నిన్న అర్ధరాత్రి సిరిసిల్ల కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కి తరలించారు పోలీసులు. రాజన్న అరెస్ట్ ను ఖండిస్తూ సీపీఐ ఎంల్ న్యూడెక్రసీ సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శి చంద్రన్న ప్రకటన విడుదల చేశారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రాజన్నను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.