జనగామ అర్బన్, వెలుగు: జనగామ వ్యవసాయ మార్కెట్అభివృద్ధి కోసం ఏఎంసీ పాలకవర్గం నిత్యం కృషి చేస్తుందని జనగామ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బనుక శివరాజ్యాదవ్ అన్నారు. శనివారం ఏఎంసీ ఆఫీస్‌లో చైర్మన్ అధ్యక్షతన పాలకవర్గం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగామ ఏఎంసీ యార్డులో నూతన 5000 టన్నుల గోదాం నిర్మాణం, మార్కెట్‌యార్డ్‌లో సోలార్ లైటింగ్, లింగాల ఘనపూర్, రఘునాథపల్లి మండలాల్లోని 5000 టన్నుల నాబార్డ్ గోదాములకు రోడ్ల నిర్మాణం, పెండింగ్ పనులు కూడా తొందర్లో పూర్తి చేస్తామన్నారు.
అనంతరం మార్కెట్‌యార్డులో పనిచేస్తున్న కార్మికుల కోసం సంఘం నాయకులు నూతన బిల్డింగ్నిర్మాణం చేయాలని వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో కార్యదర్శి జీవన్ కుమార్, ఏఎంసీ వైస్ చైర్మన్ శివ, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
