పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి : జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి : జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జనగామ అర్బన్, వెలుగు: భూ భారతి పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని జనగామ కలెక్టర్​ సందీప్ కుమార్​ ఝా అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో భూ భారతి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై అడిషనల్​ కలెక్టర్ బెన్​ షాలోమ్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా పెండింగ్ దరఖాస్తుల ప్రక్రియపై క్షుణ్ణంగా సమీక్షించి, భూ భారతిలోని వివిధ మాడ్యూల్స్ లోని సక్సెషన్, మ్యుటేషన్, ఖాతా సమీకరణ, డేటా కరెక్షన్, అర్బన్ ల్యాండ్, కోర్టు కేసులు, జీపీపీ, పీపీబీ, నాలా, తదితరాల పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. 

అనంతరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన వైద్యాధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలతో సత్కరించారు. అంతకుముందు ప్రభుత్వ వైద్య కళాశాల జీజీహెచ్​ఆధ్వర్యంలో, మెడికోస్​ బ్లడ్​ డోనర్స్​ క్లబ్​ సహకారంతో చంపక్​హిల్స్​లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్​ ప్రారంభించారు. కాలేజ్​లో ల్యాబ్​ను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాతా శిశు ఆస్పత్రిని తనిఖీ చేశారు.