Australian Open 2024: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అతి పెద్ద సంచలనం..10 సార్లు ఛాంపియన్‌కు షాక్

Australian Open 2024: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అతి పెద్ద సంచలనం..10 సార్లు ఛాంపియన్‌కు షాక్

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 సెమీ ఫైనల్లో వరల్డ్ నెంబర్ వన్, 10 సార్లు ఛాంపియన్ జొకోవిచ్ కు ఓడిపోయాడు. ఇటలీ కుర్రాడు జనిక్ సిన్నర్.. జొకోవిచ్‌పై 6-1, 6-2, 6-7(6), 6-3 తేడాతో విజయం సాధించాడు. దీంతో 11 వ సారి ఆస్ట్రేలియన్ ఓపెన్, 25 వ గ్రాండ్ స్లామ్ సాధించాలనే జొకోవిచ్ కు నిరాశ ఎదురైంది. తనకు అచొచ్చిన ఆస్ట్రేలియన్ ఓపెన్ లో జొకోవిచ్ అనూహ్యంగా పరాజయం పాలవ్వడంతో అందరూ షాక్ కు గురయ్యారు. 10 సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలుచుకున్న జొకోవిచ్..2008 నుంచి ఒక్కసారి కూడా సెమీఫైనల్, ఫైనల్లో ఓడిపోలేదు.  

తొలి సెట్ నుంచి సిన్నర్ జోరు ముందు జొకోవిచ్ తలవంచక తప్పలేదు. బలమైన సర్వీస్ లతో పాటు అద్భుతమైన ఈ ఇటలీ కుర్రాడి ధాటికి జొకోవిచ్ దగ్గర సమాధానం లేకుండా పోయింది. మొదటి రెండు సెట్లను 6-1, 6-2 తేడాతో గెలుచుకున్న సిన్నర్ మూడో సెట్ లో మాత్రం మ్యాచ్ పాయింట్ అవకాశాన్ని చేజార్చుకొని 6-7 తేడాతో సెట్ కోల్పోయాడు. అయితే కీలకమైన నాలుగో సెట్ లో సిన్నర్ పుంజుకొని 6-3 తేడాతో సెట్ తో పాటు మ్యాచ్ ను గెలిచాడు. 

ఈ మ్యాచ్ లో విజయం సాధించిన సిన్నర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లోకి ప్రవేశించాడు. సిన్నర్ ఒక గ్రాండ్ స్లామ్ ఫైనల్లోకి అడుగుపెట్టడం ఇదే తొలిసారి. ఈ రోజు(జనవరి 26) మధ్యాహ్నం మెద్వదేవ్, జ్వరెవ్ ల మధ్య జరిగే సెమీ ఫైనల్ విజేతతో సిన్నర్ ఆదివారం(జనవరి 28)  ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ ఆడతాడు.