
సౌత్ ఆఫ్రికాకు చెందిన ప్రముఖ మాజీ క్రికెటర్ , స్టార్ ఫీల్డర్ జాంటీ రోడ్స్ ..బాగ్‍లింగంపల్లిలోని సరోజిని క్రికెట్ టెన్నిస్ అండ్ ఫిట్‍నెస్ అకాడమీలో శుక్రవారం సందడి చేశాడు. మూడు రోజుల పాటు అకాడమీలో సాగే ఈ శిక్షణ తరగతులను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్బంగా క్రికెట్ ఆటలోని నైపుణ్యాలను, మెలకువలను విద్యార్థులకు వివరించాడు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 40 మంది విద్యార్థులు శిక్షణ శిబిరాల్లో పాల్గొంటున్నారు. ఫస్ట్ డే కోచ్ రియాన్ మోర్గన్‍తొ కలిసి జాంటీ రోడ్స్ విద్యార్థులకు బేసిక్స్ చెప్పడంతోపాటు ఆటలో చురుకుదనం, ఫీల్డింగ్ డ్రిల్స్ వంటి అంశాలను వివరించాడు. కోచ్ రియాన్ మోర్గన్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఆట మధ్యలో మంచి నీళ్లు తాగుతూ ఉండాలని, సన్ క్రీమ్‍ను తప్పక వాడాలని, ఇతరత్రా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ శిక్షణ శిబిరంలో సరోజిని అకాడమీ కార్యదర్శి, జాతీయ మాజీ వాలీబాల్ క్రీడాకారుడు, టీఎస్‍ఆర్టీసీ సీనియర్ పీఆర్‍ఓ మేనేజర్ జి.కిరణ్ రెడ్డి సమన్వయ కర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ క్రికేట్ అసోసియేషన్ సభ్యులు విజయ్ కుమార్ పాల్గొన్నారు. శిక్షణా తరగతుల వివరాల కోసం విజయ్ కుమార్(9860977222), మిహీర్ (84840224400)లను సంప్రదించవచ్చు.