Sanae Takaichi: జపాన్ హిస్టరీలోనే ఫస్ట్ టైం.. తొలి మహిళా ప్రధానిగా సనై తకైచి

Sanae Takaichi: జపాన్ హిస్టరీలోనే ఫస్ట్ టైం.. తొలి మహిళా ప్రధానిగా సనై తకైచి

టోక్యో: జపాన్ దేశానికి తొలి ప్రధానిగా సనై తకైచి ఎన్నికయ్యారు. జపాన్ దేశ రాజకీయ చరిత్రలోనే ఇదొక అరుదైన ఘట్టం. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ నిర్వహించిన ఎన్నికల్లో తకైచి అధ్యక్షురాలు ఎన్నికయ్యారు. 465 సీట్లు ఉన్న జపాన్ పార్లమెంట్లో అధికారం చేపట్టాలంటే 233 ఓట్లు సాధించాలి. తకైచి 237 ఓట్లు సాధించింది. ఇలా సనై తకైచిని జపాన్ ప్రధాని పదవి వరించింది. 

ఆమె అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లాంటిది కాదని, ఆమెకు ఏది ఒప్పు, ఏది తప్పు అనే విషయంలో స్పష్టత ఉందని ఆమె సొంతూరుకు చెందిన 76 ఏళ్ల పెన్షనర్ టోరు తకహషి చెప్పుకొచ్చారు. 64 ఏండ్ల సనై తకైచి తన స్వస్థలం నారా నుంచి 1993లో జపాన్ పార్లమెంట్​కు ఎన్నికయ్యారు. ఆర్థిక భద్రత, అంతర్గత వ్యవహారాలు, లింగ సమానత్వ మంత్రితో సహా పలు కీలక పదవుల్లో తకైచి పనిచేశారు.

జపాన్ చక్రవర్తిని కలిసిన తర్వాత ఆమె అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. మంగళవారం సాయంత్రం జపాన్ 104వ ప్రధానమంత్రిగా ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికల ఓటములకు బాధ్యత వహించి గత నెలలో రాజీనామా చేసిన షిగేరు ఇషిబా స్థానంలో ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా షిగెరు ఇషిబా తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల దేశంలో జరిగిన ఎన్నికల్లో పార్లమెంటు ఎగువ సభలో అధికార పార్టీ మెజార్టీ సాధించలేదు. అంతకుముందు దిగువ సభలో కూడా మెజార్టీ కోల్పోయింది. దీంతో ఇషిబా రాజీనామా చేశారు.