అసెంబ్లీని సందర్శించిన జపాన్ సభ్యులు...తెలంగాణ విశిష్టతను వివరించిన స్పీకర్, మండలి చైర్మన్

అసెంబ్లీని సందర్శించిన జపాన్ సభ్యులు...తెలంగాణ విశిష్టతను వివరించిన స్పీకర్, మండలి చైర్మన్

హైదరాబాద్, వెలుగు: జపాన్ లోని అయిచి  రాష్ట్ర అసెంబ్లీ సభ్యుల బృందంతో కూడిన అయిచి ఎకనామిక్ డెవలప్మెంట్ ఫోరం తెలంగాణ అసెంబ్లీని మంగళవారం సందర్శించింది.  ఫోరం చైర్మన్ హిరిహితో కోండో, తొమ్మిది మంది అయిచి రాష్ట్ర ఎమ్మెల్యేల  బృందానికి స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సెక్రటరీలు తిరుపతి, నరసింహచార్యులు స్వాగతం పలికారు. 

స్పీకర్ చాంబర్​లో సమావేశమైన అయిచి రాష్ట్ర సభ్యుల బృంద సభ్యులు వివిధ రంగాలలో సహకారంపై చర్చించారు. తెలంగాణ ప్రాంతం సంస్కృతి, సాంప్రదాయాలు ఉన్నతమైనవని, ఎన్నో ఏండ్ల పోరాటాల తరువాత తెలంగాణ రాష్ట్రం 2014 లో నూతనంగా ఏర్పడిందని అయిచి ఫోరం మెంబర్లకు స్పీకర్ తెలిపారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి  మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని వివరించారు.