బుమ్రా..సూపర్‌ షో: ఫస్ట్‌‌ క్లాస్‌‌లో ఫస్ట్‌‌ ఫిఫ్టీ కొట్టిన పేసర్​

బుమ్రా..సూపర్‌ షో: ఫస్ట్‌‌ క్లాస్‌‌లో ఫస్ట్‌‌ ఫిఫ్టీ కొట్టిన పేసర్​

సిడ్నీ: టెస్ట్‌‌‌‌ సిరీస్‌‌‌‌కు ముందు టీమిండియాకు అదిరిపోయే ప్రాక్టీస్‌‌‌‌ లభించింది. బ్యాటింగ్‌‌‌‌లో కాస్త తడబడినా.. అదిరిపోయే బౌలింగ్‌‌‌‌తో శుక్రవారం మొదలైన పింక్‌‌‌‌ బాల్‌‌‌‌ వామప్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ను తొలి రోజే రసవత్తరంగా మార్చేసింది. ఇండియన్‌‌‌‌ అటాక్‌‌‌‌ సమష్టిగా రాణించడంతో.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా–ఎ ఫస్ట్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌లో 32.2 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. అలెక్స్‌‌‌‌ క్యారీ (32) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. అంతకుముందు ఇండియా ఫస్ట్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌లో 48.3 ఓవర్లలో 194 రన్స్‌‌‌‌ చేసింది. బుమ్రాతో పాటు శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ (43), పృథ్వీ షా (40) ఫర్వాలేదనిపించారు. ప్రస్తుతం ఇండియా 86 రన్స్‌‌‌‌ లీడ్‌‌‌‌లో ఉంది. భారీ వర్షం కారణంగా గంటపాటు ఆటకు అంతరాయం కలిగినా.. ఒకే రోజు 20 వికెట్లు పడటం విశేషం.

ముగ్గురు మినహా….

టాస్‌‌‌‌ గెలిచి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఇండియా ఇన్నింగ్స్‌‌‌‌లో గిల్‌‌‌‌, పృథ్వీ, బుమ్రా మినహా మిగతా వారందరూ విఫలమయ్యారు. ఓపెనింగ్‌‌‌‌పై భారీ ఆశలు పెట్టుకున్న మయాంక్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌ (2) తొందరగానే ఔటైనా.. గిల్‌‌‌‌, పృథ్వీ రెండో వికెట్‌‌‌‌కు 63 రన్స్‌‌‌‌ జోడించి ఇన్నింగ్స్‌‌‌‌ను సుస్థిరం చేశారు. అయితే ఈ ఆరంభాన్ని మిగతా బ్యాట్స్‌‌‌‌మెన్‌‌‌‌ సద్వినియోగం చేసుకోలేకపోయారు. టెస్ట్‌‌‌‌ స్పెషలిస్ట్‌‌‌‌గా ముద్రపడిన కెప్టెన్‌‌‌‌ రహానె (4)తో పాటు విహారి (15), సాహా (0), పంత్‌‌‌‌ (5), సైనీ (4), షమీ (0) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ఆసీస్‌‌‌‌ పేస్‌‌‌‌ అటాక్‌‌‌‌ అబాట్‌‌‌‌ (3/46), విల్డర్‌‌‌‌ముత్‌‌‌‌ (3/13) ముందు నిలువలేకపోయారు. విహారి మినహా మిగతా వారందరూ సింగిల్‌‌‌‌ డిజిట్‌‌‌‌ స్కోరుకే పరిమితమయ్యారు. దీంతో ఇండియా 123 రన్స్‌‌‌‌కే 9 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే ఈ టైమ్‌‌‌‌లో బుమ్రా.. కంగారూ బౌలర్లకు పరీక్ష పెట్టాడు. రెండో ఎండ్‌‌‌‌లో సిరాజ్‌‌‌‌ (22) కూడా సమయోచితంగా స్పందించాడు. ఈ ఇద్దరు ఏమాత్రం ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా షాట్లు కొడుతూ మెల్లగా స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. సదర్లాండ్‌‌‌‌ వేసిన బౌన్సర్‌‌‌‌ను భారీ సిక్సర్‌‌‌‌గా మలిచిన బుమ్రా.. ఫస్ట్‌‌‌‌ క్లాస్‌‌‌‌ క్రికెట్‌‌‌‌లో ఫస్ట్‌‌‌‌ ఫిఫ్టీని ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్‌‌‌‌గా పదో వికెట్‌‌‌‌కు ఈ జోడీ 71 రన్స్‌‌‌‌ జోడించడంతో ఇండియా గౌరవప్రదమైన స్కోరు సాధించింది. బుమ్రా బ్యాటింగ్‌‌‌‌కు ముగ్దులైన టీమ్‌‌‌‌మేట్స్‌‌‌‌ క్లాప్స్‌‌‌‌ కొడుతూ.. ‘గార్డ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ హానర్‌‌‌‌’తో గౌరవించారు.

పేస్‌‌‌‌ త్రయం జోరు..

బ్యాటింగ్‌‌‌‌లో కాస్త ఇబ్బందిపడ్డ పిచ్‌‌‌‌పై.. ఇండియన్‌‌‌‌ పేస్‌‌‌‌ త్రయం బుమ్రా, షైనీ, షమీ చెలరేగిపోయారు. యంగ్‌‌‌‌ ఆస్ట్రేలియన్‌‌‌‌ బ్యాట్స్‌‌‌‌మెన్‌‌‌‌పై నిప్పులు చెరిగే బంతులతో ముప్పేట దాడి చేశారు. ఓపెనర్లలో హారిస్‌‌‌‌ (26), మిడిలార్డర్‌‌‌‌లో క్యారీ ఓ మాదిరిగా ఆడినా.. మిగతా బ్యాట్స్‌‌‌‌మెన్‌‌‌‌ రన్స్‌‌‌‌ చేయడానికి తీవ్రంగా ఇబ్బందులుపడ్డారు. రెండో ఓవర్‌‌‌‌లో బర్న్స్‌‌‌‌ (0)తో మొదలైన వికెట్లపతనం చివరి వరకు కొనసాగింది. మాడిసన్‌‌‌‌ (19), విల్డర్‌‌‌‌ముత్‌‌‌‌ (12) కాసేపు పోరాడి విఫలమయ్యారు. నలుగురు బ్యాట్స్‌‌‌‌మెన్‌‌‌‌ డకౌట్‌‌‌‌ కావడంతో ఆసీస్‌‌‌‌ ఏ దశలోనూ కోలుకోలేపోయింది. దీంతో హోమ్‌‌‌‌ టీమ్‌‌‌‌ తక్కువ స్కోరుకే పరిమితమైంది.

ఇండియా ఫస్ట్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌: గిల్‌‌‌‌ (సి) క్యారీ (బి) గ్రీన్‌‌‌‌ 43, విహారి (బి) విల్డర్‌‌‌‌ముత్‌‌‌‌ 15, రహానె (సి) క్యారీ (బి) విల్డర్‌‌‌‌ముత్‌‌‌‌ 4, పంత్‌‌‌‌ (ఎల్బీ) విల్డర్‌‌‌‌ముత్‌‌‌‌ 5, సాహా (సి) సదర్లాండ్‌‌‌‌ (బి) అబాట్‌‌‌‌ 0, సైనీ (సి) మాడిసన్‌‌‌‌ (బి) కాన్వే 4, షమీ (సి) క్యారీ (బి) అబాట్‌‌‌‌ 0, బుమ్రా (నాటౌట్‌‌‌‌) 55, సిరాజ్‌‌‌‌ (సి) హారిస్‌‌‌‌ (బి) స్వెప్సన్‌‌‌‌ 22, ఎక్స్‌‌‌‌ట్రాలు: 4, మొత్తం: 48.3 ఓవర్లలో 194 ఆలౌట్‌‌‌‌. వికెట్లపతనం: 1–9, 2–72, 3–102, 4–102, 5–106, 6–111, 7–111, 8–116, 9–123, 10–194. బౌలింగ్‌‌‌‌: అబాట్‌‌‌‌ 12–6–46–3, కాన్వే 11–3–45–1, సదర్లాండ్‌‌‌‌ 9–0–54–1, గ్రీన్‌‌‌‌ 6.1–2–20–1, విల్డర్‌‌‌‌ముత్‌‌‌‌ 8–4–13–3, స్వెప్సన్‌‌‌‌ 2.2–0–15–1.

ఆస్ట్రేలియా-ఎ ఫస్ట్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌: హారిస్‌‌‌‌ (సి) గిల్‌‌‌‌ (బి) షమీ 26, బర్న్స్‌‌‌‌ (సి) పంత్‌‌‌‌ (బి) బుమ్రా 0, మాడిసన్‌‌‌‌ (సి) సాహా (బి) సిరాజ్‌‌‌‌ 19, మెక్‌‌‌‌డెర్మాట్‌‌‌‌ (ఎల్బీ) షమీ 0, క్యారీ (సి) పంత్‌‌‌‌ (బి) సైనీ 32, అబాట్‌‌‌‌ (సి) పంత్‌‌‌‌ (బి) షమీ 0, విల్డర్‌‌‌‌ముత్‌‌‌‌ (సి) పంత్‌‌‌‌ (బి) బుమ్రా 12, సదర్లాండ్‌‌‌‌ (సి) గిల్‌‌‌‌ (బి) సైనీ 0, ప్యాట్రిక్‌‌‌‌ రోవ్‌‌‌‌ (నాటౌట్‌‌‌‌) 7, స్వెప్సన్‌‌‌‌ (సి) సాహా (బి) సైనీ 1, కాన్వే (రనౌట్‌‌‌‌) 7, ఎక్స్‌‌‌‌ట్రాలు: 4, మొత్తం: 32.2 ఓవర్లలో 108 ఆలౌట్‌‌‌‌. వికెట్లపతనం: 1–6, 2–46, 3–46, 4–52, 5–56, 6–83, 7–84, 8–97, 9–99, 10–108. బౌలింగ్‌‌‌‌: షమీ 11–4–29–3, బుమ్రా 9–0–33–2, సిరాజ్‌‌‌‌ 7–1–26–1, సైనీ 5.2–0–19–3.