పోయినేడాది పనైపోయిందన్నరు..ఇప్పుడు బెస్ట్ అంటున్నరు

పోయినేడాది పనైపోయిందన్నరు..ఇప్పుడు బెస్ట్ అంటున్నరు

న్యూఢిల్లీ : ఖతర్నాక్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఇండియాను గెలిపించిన స్టార్ పేసర్ జస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రీత్ బుమ్రా తన విషయంలో  కొందరి అభిప్రాయాలు చూసి నవ్వొస్తోందని అంటున్నాడు. గతేడాది  వెన్ను గాయానికి సర్జరీ చేయించుకొని  ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నకు దూరం అవ్వడంతో  తన పని అయిపోయిందని, ఇక తిరిగి  జట్టులోకి రాలేనని అన్నారని, ఇప్పుడేమో అత్యుత్తమ దశలో ఉన్నానని పొగుడుతున్నారని చెప్పాడు. అయితే తాను ఇలాంటి వాటిని పట్టించుకోవడం లేదని బుమ్రా స్పష్టం చేశాడు.

‘ నా వరకు , నేను నా సత్తా మేరకు బెస్ట్  బౌలింగ్ చేస్తున్నానా? అని ఆలోచించడం చూడటం లేదు.  నా ముందు ఉన్న సమస్యను నేను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నా.  ఇలాంటి  (న్యూయార్క్) వికెట్లపై ఎలా బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలనేదానిపైనే ఫోకస్ పెడుతున్నా. బ్యాటర్లు షాట్లు ఆడకుండా ఎలా అడ్డుకోవాలి?  నా ముందున్న బెస్ట్ ఆప్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏంటి? అనేదే చూస్తా. పరిస్థితులకు తగ్గట్టుగా నేను ఏం చేయాలనే దానిపైనే దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తా’ అని బుమ్రా చెప్పాడు 

బుమ్రా జీనియస్ : రోహిత్

బుమ్రాపై కెప్టెన్ రోహిత్ పొగడ్తల వర్షం కురిపించాడు. అతను జీనియస్ బౌలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని కొనియాడాడు. ఈ వరల్డ్ కప్ ముగిసేంత వరకు బుమ్రా ఇలానే ఆడాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. ‘జట్టు కోసం బుమ్రా తన శక్తి మొత్తం ధారపోస్తున్నాడు. తన సత్తా ఏంటో, అతను ఏం చేయగలడో మనందరికీ తెలుసు. ఈ వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొత్తం బుమ్రా ఇలాంటి మైండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే ఉండాలని కోరుకుంటున్నాం’ అని రోహిత్ పేర్కొన్నాడు.