సిడ్నీలో సిరాజ్, బుమ్రాలపై జాతి వివక్ష వ్యాఖ్యలు

V6 Velugu Posted on Jan 09, 2021

సిడ్నీలో టీమిండియా క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలకు చేదు అనుభవం ఎదురైంది. మూడో టెస్టు సందర్భంగా వారు జాతి వివక్ష వ్యాఖ్యలు ఎదుర్కొన్నారు. ప్రేక్షకుల్లోంచి కొందరు సిరాజ్, బుమ్రాలను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. బుమ్రా, సిరాజ్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని టీమిండియా క్రికెటర్లు వెంటనే మేనేజ్ మెంట్ కు తెలియజేశారు. దీనిపై టీమిండియా మేనేజ్ మెంట్ ఐసీసీకి ఫిర్యాదు చేసింది.

ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ఐసీసీ… టీమిండియా ఫిర్యాదును స్వీకరించి విచారణకు రెడీ అయ్యింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ‘వెన్యూస్ న్యూసౌత్ వేల్స్’ తో  కలిసి సీసీ టీవీ కెమెరాల ఫుటేజిని పరిశీలిస్తోంది. ఆస్ట్రేలియాలో పర్యటించే క్రికెట్ జట్లకు ఇలాంటి అనుభవాలు కొత్తేంకాదు. గతంలోనూ అనేక వివాదాలు వర్ణ వివక్ష వ్యాఖ్యల ఫలితంగానే జరిగాయి.

Tagged Mohammed Siraj, Face Racial Abuse, Jasprit Bumrah, Sydney Cricket Ground

Latest Videos

Subscribe Now

More News