బుమ్రా విషయంలో బీసీసీఐ అధికారిక ప్రకటన

బుమ్రా విషయంలో బీసీసీఐ అధికారిక ప్రకటన

టీ20 వరల్డ్ కప్కు ముందు టీమిండియా భారీ షాక్ తగిలింది. వెన్ను నొప్పి కారణంగా టీ20 వరల్డ్ కప్కు స్టార్ పేసర్ బుమ్రా దూరమయ్యాడు. వెన్ను నొప్పి తీవ్రంగా ఉండటంతో అతను టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. వెన్నునొప్పి కారణంగా బీసీసీఐ మెడికల్ టీమ్ అతన్ని సౌతాఫ్రికా టీ20 సిరీస్ కు తప్పించింది. ఆ తర్వాత అతని పరిస్థితిని సమీక్షించిన బీసీసీఐ బృందం..టీ20 వరల్డ్ కప్ నుంచి బుమ్రాను తప్పిస్తున్నట్లు పేర్కొంది. బుమ్రా స్థానంలో త్వరలో మరో ప్లేయర్ ను ప్రకటిస్తామని బీసీసీఐ వెల్లడించింది. 

వెన్నులో ఫ్రాక్చర్..
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు ఎంపికైన బుమ్రా..వెన్ను నొప్పితో ఫస్ట్ టీ20ల్లో ఆడలేదు. ఫస్ట్ టీ20 ముందు రోజు అంటే  ప్రాక్టీస్ సెషన్‌లో వెన్ను నొప్పి వస్తుందని ఫిజియోలకు చెప్పడంతో ఈ మ్యాచ్‌కు బుమ్రాను దూరంగా ఉంచినట్లు బీసీసీఐ ట్వీట్ చేసింది. మ్యాచ్ తర్వాత బుమ్రాకు పరీక్షలు నిర్వహించగా.. అతని వెన్నులో ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. అయితే ఇందుకు ఎలాంటి సర్జరీ అవసరం లేకపోయినా....4 నుంచి 6 నెలల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దాంతోనే అతను రెండో టీ20 ఆడేందుకు గౌహతికి వెళ్లలేదు.

విండీస్, జింబాబ్వే సిరీస్లకు విశ్రాంతి..
ఈ ఏడాది జులైలో ఇంగ్లండ్తో  పర్యటన కొద్ది రోజుల పాటు బుమ్రా విశ్రాంతి తీసుకున్నాడు. ఇందులో భాగంగానే వెస్టిండీస్ తీ టీ20, వన్డే సిరీస్లలో ఆడలేదు. ఆ తర్వాత జింబాబ్వే టూర్ నుంచి కూడా తప్పుకున్నాడు. అయితే ఆసియాకప్‌ ముందు వెన్ను నొప్పి రావడంతో...మెగా టోర్నీకి బుమ్రా దూరమయ్యాడు.