చొప్పదండి నవోదయ విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

చొప్పదండి నవోదయ విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

చొప్పదండి, వెలుగు: కరీంనగర్​ జిల్లా చొప్పదండిలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2027–28 విద్యా సంవత్సరానికి  గాను 9వ, 11వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం లేటరల్​ఎంట్రీ సెలక్షన్​ టెస్ట్​కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్​చార్జ్​ ప్రిన్సిపాల్​బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు 9వ తరగతికి, టెన్త్ చదువుతున్న విద్యార్థులు 11వ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

లేటరల్​ ఎంట్రీ టెస్ట్​ 2027 ఏప్రిల్ 10న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆన్​లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైందని, దరఖాస్తులు సమర్పించేందుకు ఈ నెల 30 చివరి తేదీ అన్నారు. అర్హత గల విద్యార్థులు 9వ తరగతి కోసం <https://cbseitms.nic.in/2026/nvsix 9/>, 11వ తరగతి కోసం<https://cbseitms.nic.in/2026/nvsxi> 11/ లింక్ ​ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలు, అవసరమైన ధ్రువపత్రాలు, దరఖాస్తు విధానం కోసం నవోదయ విద్యాలయంలో సంప్రదించవచ్చని ఇన్​చార్జ్ ప్రిన్సిపాల్ ​సూచించారు.