జయలలిత వారసులెవరో తేల్చిన మద్రాసు కోర్టు

జయలలిత వారసులెవరో తేల్చిన మద్రాసు కోర్టు

చెన్నై: తమిళనాడు మాజీ సీఎం జయలలిత వారసులెవరో తేలిపోయింది. మేనల్లుడు దీపక్‌‌‌‌‌‌‌‌, మేనకోడలు దీపను అమ్మ లీగల్‌‌‌‌‌‌‌‌ హెయిర్స్‌‌‌‌‌‌‌‌గా మద్రాసు హైకోర్టు ప్రకటించింది. దీంతో ఆమెకు అసలు ఎన్ని ఆస్తులున్నాయి, వాటి విలువెంతని చర్చ నడుస్తోంది. కోర్టుకు రిపోర్టు ఇచ్చిన టైమ్‌‌‌‌‌‌‌‌లో అమ్మ ఆస్తులపై 3 రకాల లెక్కలను కోర్టు ముందుంచారు. దీపక్‌‌‌‌‌‌‌‌, దీపనేమో రూ. 188 కోట్లని, తమిళనాడు సర్కారేమో రూ.913 కోట్లని చెప్పారు. ఆ తర్వాత విచారణ టైమ్‌‌‌‌‌‌‌‌లో ఆస్తుల విలువ రూ. వెయ్యి కోట్లకు పైన ఉంటుందన్నారు. ఈ ఆస్తులన్నీ 1991 నుంచి 1996 మధ్య జయలలిత సీఎంగా ఉన్నప్పుడు పొందినవే. ఈ 25 ఏండ్లలో ఆమె ఆస్తులు పెరిగే ఉంటాయని అనుకుంటున్నారు.

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ కొంపల్లిలో ఫామ్‌‌‌‌‌‌‌‌ హౌజ్‌‌‌‌‌‌‌‌

సినిమాల్లో నటిస్తున్న టైమ్‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని కొన్ని ప్రాంతాల్లో విలువైన ఆస్తులను జయలలిత కొన్నారు. సిటీలోని ఆస్తులను 2015 ఎన్నికల ఆఫిడవిట్‌‌‌‌‌‌‌‌లో ప్రస్తావించారు. సిటీలో ఆమెకున్న కమర్షియల్, రెసిడెన్షియల్, ఫామ్‌‌‌‌‌‌‌‌ ల్యాండ్స్‌‌‌‌‌‌‌‌ను విశ్రాంతికి వాడుకునే వారని చెబుతుంటారు.  పుస్తకాలు చదివేందుకు అపుడపుడు  మేడ్చల్ జిల్లా పరిధిలోని కొంపల్లిలో ఉన్న 14 ఎకరాల జేజే గార్డెన్ ఫామ్‌‌‌‌‌‌‌‌ హౌజ్‌‌‌‌‌‌‌‌కు వచ్చేవారని తెలిసింది. బత్తాయి, ద్రాక్ష తోటలతో ఆ ఫామ్‌‌‌‌‌‌‌‌ హౌజ్‌‌‌‌‌‌‌‌ను అందంగా తీర్చిదిద్దారు. వచ్చినప్పుడల్లా కనీసం వారం పాటు సిటీలోనే గడిపేవారని.. ఆ టైమ్‌‌‌‌‌‌‌‌లో అభిమానులు, పార్టీ లీడర్లకు అనుమతి ఉండేది కాదని తెలిసింది.

వెస్ట్‌‌‌‌‌‌‌‌ మారేడ్‌‌‌‌‌‌‌‌పల్లిలో సొంతిళ్లు

వెస్ట్ మారేడ్‌‌‌‌‌‌‌‌పల్లిలోని రాధిక కాలనీలో జయలలితకు సొంతిళ్లు ఉంది. కంటోన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ బోర్డు వర్గాలు అప్పట్లో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించాలని నోటీసులు కూడా పంపారు. ఇంటిముందు శశికళ నటరాజన్‌‌‌‌‌‌‌‌ అని ఇప్పటికీ ఉందని స్థానికులు చెబుతారు.   ప్రస్తుతం ఆ మూడంతస్తుల బిల్డింగ్‌‌‌‌‌‌‌‌లో యునైటెడ్ స్పిరిట్ లిమిటెడ్ సంస్థ కిరాయికి ఉంటుందని తెలిసింది.

అమ్మ ఫేవరెట్‌‌‌‌‌‌‌‌ సమ్మర్‌‌‌‌‌‌‌‌ ట్రీట్‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌ 900 ఎకరాలు

జయలలిత ఫేవరెట్‌‌‌‌‌‌‌‌ సమ్మర్‌‌‌‌‌‌‌‌ ట్రీట్‌‌‌‌‌‌‌‌ అయిన కొడనాడ్‌‌‌‌‌‌‌‌ టీ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌ 900కు పైగా ఎకరాల్లో ఉంది. ఇప్పుడు దాని విస్తీర్ణం రెండింతలై ఉండొచ్చని అంటున్నారు. ఆ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌ను 1992లో ఆమె కొన్నారు. దాని విలువ ఎకరాకు రూ. కోటి ఉంటుందని చెబుతున్నారు. ఇక తన ఫ్రెండ్‌‌‌‌‌‌‌‌, సహచరురాలు శశికళ, ఇతర అసోసియేట్స్‌‌‌‌‌‌‌‌తో కలిసి 32 కంపెనీలను అమ్మ స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. వాటి గురించి పెద్దగా వివరాలు తెలియదు. పైగా సుమారు 173 ప్రాపర్టీల్లో కనీసం 100 వాటిల్లో అమ్మ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌గా ఉన్నారు. అమ్మ దగ్గర రూ.5.53 కోట్ల విలువైన జ్యువెల్లరీ, వెండి బట్టలు, రూ. 4 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. అయితే 2011 అఫిడవిట్‌‌‌‌‌‌‌‌లో జయలలిత తన ఆస్తుల విలువ రూ. 51.4 కోట్లుగా పేర్కొన్నారు. 2016 ఎన్నికల్లో రూ.113.73 కోట్లుగా చూపారు.