
సినీ నటుడు రవి మోహన్ (‘జయం’ రవి), ఆర్తి రవి మధ్య విడాకుల వివాదం ఆసక్తికర మలుపు తిరిగింది. ‘జయం’ రవి, ఆర్తి విడాకుల కేసులో చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టుకు బుధవారం హాజరయ్యారు. ‘జయం’ రవి నుంచి ఆర్తి రవి భారీగా భరణం డిమాండ్ చేసింది. ప్రతీ నెలా మెయింటెనెన్స్ కింద రవి తనకు 40 లక్షలు భరణం చెల్లించాలని ఫ్యామిలీ కోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేసింది.
Twist in #RaviMohan Divorce Case 😲💔#AartiRavi has reportedly asked for ₹40 Lakhs per month as alimony! Family Court has asked Ravi to respond by June 12 🧾#Kenishaa | #JayamRavi pic.twitter.com/RfCxDnkQ3c
— Kollywood Now (@kollywoodnow) May 21, 2025
ఈ కేసు విచారణను చెన్నై 3వ అదనపు ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టు జూన్ 12వ తేదీకి వాయిదా వేసింది. రవి మోహన్, ఆర్తికి 2009లో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు మగ పిల్లలు కూడా ఉన్నారు. ‘జయం’ రవి విడాకులు కోరిన సమయంలో.. సింగర్ కెనీషా ఫ్రాన్సి్స్తో జయం రవి డేటింగ్ చేస్తున్నాడనే పుకార్లు గట్టిగా వినిపించాయి. ఆర్తి రవి కూడా మూడో మనిషి కారణంగానే తమ కాపురంలో చిచ్చు రేగిందని సోషల్ మీడియాలో ప్రకటన చేయడం గమనార్హం.
‘నీ జీవితంలో వెలుగు మా జీవితాల్లో అంధకారం నింపింది’ అని సింగర్ కెనీషా ఫ్రాన్సి్స్ను ఉద్దేశించి ఆర్తి రవి పోస్ట్ పెట్టడం తమిళ సినీ వర్గాల్లో చర్చకు కారణమైంది. ఈ విడాకుల గొడవ మొదలైనప్పటి నుంచి ఆర్తి రవికి, జయం రవికి మధ్య సోషల్ మీడియాలో పెద్ద గొడవే నడుస్తోంది. పెళ్లి సింపుల్గా చేసుకున్న ఈ జంట విడాకుల విషయంలో మాత్రం నానా రచ్చ చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.
మెయింటెనెన్స్ కింద నెలకు 40 లక్షలు ఇవ్వాలని ఆర్తి డిమాండ్ చేసినప్పటికీ ఇచ్చేందుకు ‘జయం’ రవి సిద్ధంగా ఉండకపోవచ్చు. నెలకు 40 లక్షలు అంటే సంవత్సరానికి 4 కోట్ల 80 లక్షలు జయం రవి ఆర్తికి చెల్లించాల్సి ఉంటుంది. 15 సంవత్సరాలు కలిసి కాపురం చేసిన జయం రవి, ఆర్తి విడిపోవడం.. విడాకుల ఎపిసోడ్లో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తుండటంతో కోలీవుడ్లో ఈ కపుల్ డైవర్స్ హాట్ టాపిక్ అయింది.