వీడిన జయరాం కేసు మిస్టరీ  

వీడిన జయరాం కేసు మిస్టరీ  

హైదరాబాద్​, వెలుగు: వందల కోట్ల విలువైన ఆస్తులను కాజేసేందుకే ఎన్నారై, కోస్టల్​ బ్యాంక్ ఎండీ జయరాంను రాకేశ్ రెడ్డి గ్యాంగ్ హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే ఈ కేసులో రియల్టర్లు, రౌడీషీటర్లు తెరపైకి వచ్చారు. వాళ్లే కాకుండా తెర వెనక ఉండి కుట్ర చేసిన వాళ్లనూ పోలీసులు గుర్తించారు. శుక్రవారంతో రాకేశ్ రెడ్డి సహా నిం దితుల మూడో రోజు కస్టడీ ముగిసింది. గురువారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల వరకు కమెడియన్ సూర్యప్రసాద్ ను పోలీసులు విచారించారు.మళ్లీ మధ్యాహ్నం 3 గంటలకు పిలిపించి అతడి స్టేట్​మెంట్​ను రికార్డు చేశారు. హత్యకు వారం ముందే ఎస్ ఆర్​ నగర్​కు చెందిన రౌడీషీటర్​ నగేశ్ , అతడి అల్లు డు విశాల్​తో కలిసి రాకేశ్ రెడ్డి స్కెచ్ వేసినట్టు మూడు రోజుల విచారణలో పోలీసులు తెలుసుకున్నారు.

విచారణలో తెలిసింది..

ఐదుగురు సభ్యుల రాకేశ్ గ్యాంగ్ డబ్బు కొట్టేసేందుకు పక్కాగా ప్లాన్ వేసుకున్నట్టు నిర్ధారించారు. శిఖాచౌదరితో ఆర్ధిక వివాదాలు వీణ పేరుతో జయరాంను హనీ ట్రాప్ చేసి ఆస్తులను కాజేసేందుకు కుట్ర పన్నినట్టు విచారణలో తేల్చారు. రాకేశ్ రెడ్డి మధ్యవర్తిగా ఉండి శిఖా చౌదరికి ₹1.5 కోట్లు ఇప్పించినట్టు తెలుస్తోంది. అయితే ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో శిఖా చౌదరి , రాకేశ్ రెడ్డి మధ్య విభేదాలొచ్చిన్నట్టు తెలుస్తోంది. దీంతో 6 నెలలుగా వారిద్దరి మధ్య సంబంధాలు లేనట్టు పోలీసులు గుర్తించారు. తన నుంచి తప్పించుకు తిరుగుతున్న శిఖా చౌదరి కోసం జయరాంను బంధించేందుకు రాకేశ్ రెడ్డి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. నగేశ్, విశాల్​తో కలిసి స్కెచ్ వేశాడని చెబుతున్నారు. సిటీకి  వచ్చిన జయరాం ను కమెడియన్ సూర్యప్రసాద్ సహకారంతో రాకేశ్ రెడ్డి ఇంటికి తీసుకొచ్చాడు. అప్పటికే రాకేశ్ రెడ్డి ఇంట్లో బాండ్​పేపర్లతో సిద్ధంగా ఉన్న రౌడీషీటర్​ నగేశ్, అతడి అల్లుడు విశాల్​లు.. జయరాంను బంధించారు. డబ్బుల కోసం డిమాండ్​ చేశారు.

బాండ్ పేపర్లపై సంతకం

బాండ్​ పేపర్లపై సంతకం చేయించుకున్నా రు. అయి తే, వదిలేస్తే ₹10 కోట్లు ఇస్తానని వారిని జయరాం  ప్రాధేయపడినట్టు తెలుస్తోంది. కానీ, జయరాం వందల కోట్ల ఆస్తులను దక్కించుకునేందుకు రాకేశ్ గ్యాంగ్ మర్డర్​ ప్లాన్ వేసినట్టు సమాచారం. అందుకే బాండ్​ పేపర్లపై సంతకం చేయించుకుని లిటిగేషన్ ఆస్తులుగా కేసులు పెట్టాలనుకున్నా రు. తర్వా త జయరాం భార్య పద్మశ్రీ వద్ద నుంచి డబ్బు గుంజేందుకు ప్లాన్ చేశామని రాకేశ్ రెడ్డి కస్టడీలో

చెప్పినట్టు తెలుస్తోంది. రాకేశ్ రెడ్డి, డ్రైవర్​ శ్రీనివాస్ ల కస్టడీ ముగియడంతో మరోసారి వారిని కస్టడీకి తీసుకునేందుకు పోలీసులు కోర్టు అనుమతిని కోరే అవకాశాలున్నాయి.ఇప్పటికే రికార్డ్​ చేసిన స్టేట్​మెంట్ల ఆధారంగా మరికొందరిని అరెస్ట్​ చేసి కోర్టులో ప్రవేశపెట్టేందుకు జూబ్లీహిల్స్​ పోలీసులు సిద్ధమవుతున్నారు. సూర్యప్రసాద్ తో పాటు నగేశ్ , విశాల్​ను నిందితులుగా చేర్చే అవకాశాలున్నాయి. హత్యను తప్పుదోవ పట్టించేందుకు తప్పుడు సలహాలిచ్ చారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీపీ మల్లారెడ్డి, ఇన్ స్పెక్టర్ శ్రీనివాసులును విచారించే అవకాశాలు ఉన్నాయి.