పాండవుల గుట్టల్లో భూపాలపల్లి ఎస్పీ ట్రెక్కింగ్

పాండవుల గుట్టల్లో  భూపాలపల్లి ఎస్పీ ట్రెక్కింగ్

రేగొండ, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరిలోని పాండవుల గుట్టల్లో శుక్రవారం ఎస్పీ సంకీర్త్ ట్రెక్కింగ్ చేశారు. సహజ సిద్ధమైన గుట్టలు రాక్​ క్లైంబింగ్ చేయడానికి అనువుగా ఉన్నాయని తెలంగాణ ఫారెస్ట్ ఫోర్స్ హెడ్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ సువర్ణ పేర్కొన్నారు. గుట్టల అందాలను పరిరక్షించడంతో పాటు పర్యాటకులను ఆకర్షించేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకొనున్నట్లు తెలిపారు. గతంలో గుట్టల వద్ద ట్రెక్కింగ్ నిర్వహించినట్లుగా రాబోయే రోజుల్లో చేపడతామ న్నారు. గుట్టలను సందర్శించిన వారిలో సీసీఎఫ్​కాళేశ్వరం ప్రభాకర్, భూపాలపల్లి డీఎఫ్ వో  నవీన్ రెడ్డి తదితరులు ఉన్నారు.