ప్రజాభిప్రాయం మేరకే బీఆర్ఎస్ పార్టీలోకి : జీవన్ రెడ్డి

ప్రజాభిప్రాయం మేరకే బీఆర్ఎస్ పార్టీలోకి : జీవన్ రెడ్డి

కాంగ్రెస్ మాజీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు గురువారం ( ఏప్రిల్ 9 ) జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు జీవన్ రెడ్డి. కేసీఆర్ సూచన మేరకు కేటీఆర్ తన ఇంటికి పార్టీలోకి ఆహ్వానించేందుకు వచ్చారని అన్నారు. ప్రజాభిప్రాయం మేరకే బీఆర్ఎస్ లో చేరానని వెల్లడించారు జీవన్ రెడ్డి. తనను పార్టీలోకి ఆహ్వానించినందుకు కేసీఆర్, కేటీఆర్ లకు హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు.

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం భావోద్వేగానికి గురి చేసిందని.. ఇవాళ బీఆర్ఎస్ తో కలవడం సంతోషంగా ఉందని అన్నారు జీవన్ రెడ్డి. గత 20 మాసాలుగా అవమానాలు తట్టుకుని ఓపిక పట్టానని అన్నారు. 

Also Read : వడ్ల కొనుగోలుకు మరో 60 రోజులు గడువు ఇవ్వండి

ఎందరి ప్రభుత్వాలో చూశాను.. కానీ, ఈ ప్రభుత్వం మాత్రం తిరోగమన దిశలో ఉందని అన్నారు జీవన్ రెడ్డి. ప్రజాభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నానని..కేసీఆర్ నాయకత్వంలో పని చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందని అన్నారు జీవన్ రెడ్డి.