వరి కొనుగోలు సమస్యలపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రబి 2024-25కు 5 లక్ష మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ టార్గెట్ పెట్టాలని..ఎఫ్‌సీఐ రా రైస్ టార్గెట్ తగ్గించాలని సూచించారు మంత్రి ఉత్తమ్. 8.45 లక్ష మెట్రిక్ టన్నుల రైస్ డెలివరీ ఇంకా పెండింగ్ ఉందని.. ఇప్పటికే గడువు ముగిసిన క్రమంలో మరో 60 రోజులు గడువు పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు ఉత్తమ్.
ఐదు శాతం బ్రోకెన్స్‌తో బాయిల్డ్ రైస్ సరఫరాకు మిల్లర్ల అంగీకారం తెలిపినట్లు పేర్కొన్నారు మంత్రి ఉత్తమ్. KMS 2025-26కు బాయిల్డ్ రైస్ టార్గెట్ 20 నుంచి 40 LMTలకు పెంచాలని డిమాండ్ చేశారు మంత్రి ఉత్తమ్. ఖరీఫ్ లో 71.86 LMTలు, రబిలో 95 LMTల ప్యాడీ అంచనా వేశామని అన్నారు ఉత్తమ్.పెరిగిన ఉత్పత్తికి సరిపడా టార్గెట్లు లేవని రాష్ట్రం ఆందోళనలో ఉందని అన్నారు.
ALSO READ : పండగ పూట ఎంత పనైంది.
కేంద్రం టార్గెట్లు తగ్గించడంతో నిల్వలు పెరుగుతున్నాయని.. రైతులకు MSP కల్పించేందుకు నిరంతర కొనుగోలు అవసరం ఉందని.. అదనపు ప్యాడీతో రాష్ట్రంపై భారీ ఆర్థిక భారం పడుతుందని పేర్కొన్నారు.మరో 2 నెలల గడువు పెంచాలని కోరారు.
