పేదలంటే రేవంత్కు ఎందుకంత కక్ష?..రైతు భరోసా, రుణమాఫీ ఎగ్గొట్టారు: జీవన్రెడ్డి

పేదలంటే రేవంత్కు ఎందుకంత కక్ష?..రైతు భరోసా, రుణమాఫీ ఎగ్గొట్టారు: జీవన్రెడ్డి

హైదరాబాద్​, వెలుగు: ప్రభుత్వం ఫీజు రీయింబర్స్​మెంట్​నిధులు విడుదల చేయకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం లేదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టి.జీవన్ రెడ్డి ఆరోపించారు. శనివారం తెలంగాణ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫీజు రీయింబర్స్​మెంట్ రాకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు కోర్టుకు వెళ్లాయని, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూల్ చేసుకోవచ్చని కోర్టు ఆదేశాలిచ్చిందని గుర్తుచేశారు.

కాలేజీలకు రీయింబర్స్ మెంట్ చేయకుండా విద్యార్థులకు ఇస్తామంటే ఎలా నమ్మాలన్నారు. పేదలంటే సీఎం రేవంత్​కు ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు. రైతు భరోసా, రుణమాఫీ రెండు విడతలు ఎగ్గొట్టారని మండిపడ్డారు. రేవంత్​రెడ్డికి హైడ్రా, ఫోర్త్​సిటీ తప్ప.. మిగతా సమస్యలేవీ కనిపించడం లేదని విమర్శించారు. రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించారని, అది అమలవుతున్నదో.. లేదో తెలుసుకోవాలని సూచించారు.