
తెలంగాణ అవసరాలు తీర్చకుండా గోదావరి నీటిని కృష్ణా బేసిన్ కు ఎలా తరలిస్తారన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. గోదావరి నీటిని శ్రీశైలానికి తరలించాలన్న కేసీఆర్ ప్రతిపాదనను ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. ఇది తెలంగాణ నీటిని ఆంధ్రకు దోచిపెట్టడం కాదా అని ప్రశ్నించారు. జగన్, కేసీఆర్ భేటీని సమైక్య, విభజనవాదుల భేటీగా అభివర్ణించిన జీవన్ రెడ్డి..గతంలో ఇదే ప్రతిపాదన వైఎస్ చేస్తే కేసీఆర్ వ్యతిరేకించలేదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలోనూ అనేక లోపాలున్నాయన్నారు . తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి ఉంటే రెండు లిఫ్టుల భారం తగ్గేదన్నారు జీవన్ రెడ్డి. కేసీఆర్ ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా ఫీల్ అవుతున్నారని విమర్శించారు.