శ్రీలంకను చిత్తు చేసిన విమెన్స్‌‌‌‌ ఇండియా

శ్రీలంకను చిత్తు చేసిన విమెన్స్‌‌‌‌ ఇండియా

సిల్హెట్‌‌‌‌‌‌‌‌‌‌ (బంగ్లాదేశ్‌‌‌‌): యంగ్‌‌‌‌ బ్యాటర్‌‌‌‌ జెమీమా రోడ్రిగ్స్‌‌‌‌ (53 బాల్స్‌‌‌‌లో 11 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 76) కెరీర్‌‌‌‌ బెస్ట్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌కు తోడు, బౌలర్లు కూడా సత్తా చాటడంతో విమెన్స్‌‌‌‌ ఆసియా కప్‌‌‌‌ టీ20 టోర్నమెంట్‌‌‌‌లో ఇండియా ఘన విజయంతో బోణీ చేసింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌‌‌‌లో టీమిండియా 41 రన్స్‌‌‌‌ తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. టాస్‌‌‌‌ ఓడి తొలుత బ్యాటింగ్‌‌‌‌ చేసిన ఇండియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 150 స్కోరు చేసింది. రోడ్రిగ్స్‌‌‌‌తో  హర్మన్‌‌‌‌ ప్రీత్‌‌‌‌ కౌర్ (33) సత్తా చాటింది. లంక బౌలర్లలో  ఒషాడి రణసింఘె (3/32) మూడు వికెట్లతో రాణించింది. అనంతరం ఛేజింగ్‌‌‌‌కు దిగిన లంక 18.2 ఓవర్లలో 109 స్కోరుకే ఆలౌటై ఓడిపోయింది. హాసిని పెరీర (30), హర్షిత (26) మాత్రమే కాసేపు ప్రతిఘటించారు. ఇండియా బౌలర్లలో డి. హేమలత (3/15) మూడు వికెట్లతో దెబ్బకొట్టగా.. పూజా వస్త్రాకర్‌‌‌‌ (2/12), దీప్తి శర్మ (2/15) చెరో రెండు వికెట్లతో సత్తా చాటారు. జెమీమాకు ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌ అవార్డు దక్కింది. 

రోడ్రిగ్స్‌‌‌‌ జోరు

ఓపెనర్లు షెఫాలీ వర్మ (10), స్మృతి మంధాన (6) ఫెయిలవడంతో 4 ఓవర్లకే ఇండియా 23/2తో ఇబ్బందుల్లో పడింది.  వన్‌‌‌‌డౌన్‌‌‌‌లో వచ్చిన జెమీమా..  కెప్టెన్‌‌‌‌  హర్మన్‌‌‌‌ ప్రీత్‌‌‌‌ కౌర్ (33) సపోర్ట్‌‌‌‌తో ఇన్నింగ్స్‌‌‌‌ను నిలబెట్టింది. హర్మన్‌‌‌‌ స్ట్రయిక్‌‌‌‌ రొటేట్‌‌‌‌ చేయగా.. రోడ్రిగ్స్‌‌‌‌ భారీ షాట్లతో అలరించింది. ఈ క్రమంలో 38 బాల్స్‌‌‌‌లోనే హాఫ్‌‌‌‌ సెంచరీ పూర్తి చేసుకుంది. 16 ఓవర్లో హర్మన్‌‌‌‌ ఔటవడంతో మూడో వికెట్‌‌‌‌కు 92 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. తర్వాత రోడ్రిగ్స్‌‌‌‌తో పాటు చివర్లో వరుసగా వికెట్లు పడినా ఇండియా 150 మార్కు చేరుకుంది.   

సంక్షిప్త స్కోర్లు
ఇండియా: 20 ఓవర్లలో 150/6 (జెమీమా 76, హర్మన్‌‌‌‌ 33, ఒషాడి 3/32)
శ్రీలంక: 18.2 ఓవర్లలో 109 ఆలౌట్‌‌‌‌ (హాసిన 30, హేమలత 3/15).