ఇవ్వాల్సింది రూ. 85 లక్షలు.. ఇస్తామంటుంది రూ.23 వేలే!

ఇవ్వాల్సింది రూ. 85 లక్షలు.. ఇస్తామంటుంది రూ.23 వేలే!
  •     జెట్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌వేస్‌‌‌‌ ఉద్యోగులకు రిజల్యూషన్‌‌‌‌ ప్లాన్‌‌‌‌లో కేటాయింపులు డల్‌‌‌‌

న్యూఢిల్లీ: జెట్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌వేస్‌‌‌‌ ఉద్యోగులకు రూ. 3 లక్షల నుంచి రూ. 85 లక్షల వరకు బాకీ ఉంటే,  కల్‌‌‌‌రాక్‌‌‌‌ జలన్ కన్సార్షియం ఉద్యోగికి రూ. 23 వేలు మాత్రమే ఇవ్వడానికి ముందుకొస్తోంది. జెట్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌వేస్ ఇన్‌‌‌‌సాల్వన్సీ పేపర్ల ప్రకారం ఉద్యోగులకు పెద్ద మొత్తంలో డబ్బులు రావాల్సి ఉంది.  కానీ, కల్‌‌‌‌రాక్‌‌‌‌–జలాన్‌‌‌‌ సబ్మిట్ చేసిన రిజల్యూషన్ పేపర్లలో మాత్రం వేరేగా ఉంది.   తాజాగా నేషనల్‌‌‌‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌‌‌‌ (ఎన్‌‌‌‌సీఎల్‌‌‌‌టీ)  ఈ కన్సార్షియం రిజల్యూషన్ ప్లాన్‌‌‌‌కు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ప్లాన్ ప్రకారం ఎంప్లాయ్స్‌‌‌‌కు పేమెంట్స్  జరగాలంటే 95 శాతం మంది ఉద్యోగులు వచ్చే మూడు నెలల్లో తమ అంగీకారాన్ని తెలపాల్సి ఉంటుంది. కానీ, ఈ ప్లాన్‌‌‌‌లో  గ్రాట్యుటీ వంటి స్టాట్యుటరీ బకాయిల గురించి ప్రస్తావించలేదు. అంతేకాకుండా ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై కూడా ఎటువంటి క్లారిటీ లేదు. ‘తాజాగా ఆమోదం పొందిన రిజల్యూషన్‌‌‌‌పై ఉద్యోగులు యెస్‌‌‌‌ లేదా నో అని ఓట్ వేయాలని జెట్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌వేస్ కోరింది.  కానీ, ఈ ప్లాన్ కింద  ఉద్యోగికి రావాల్సిన బకాయిలో కేవలం 0.5 శాతం మాత్రమే వస్తుంది. ఇది సుమారు జీరోకి సమానం’ అని ఆల్‌‌‌‌ ఇండియా జెట్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌వేస్‌‌‌‌ ఆఫీసర్స్‌‌‌‌ అండ్ స్టాఫ్‌‌‌‌ అసోసియేషన్  ప్రెసిడెంట్‌‌‌‌ కిరణ్‌‌‌‌ పవాస్కర్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు. ‘ఈ ఇష్యూ పరిష్కారం కాకపోతే కోర్టుకి వెళతాం’ అని తెలిపారు. తాజాగా సివిల్ ఏవియేషన్‌‌‌‌ మినిస్టకు లెటర్స్ పంపామని అన్నారు.