70 ఏళ్ల తర్వాత అభివృద్ధిలోకి యూపీ

70 ఏళ్ల తర్వాత అభివృద్ధిలోకి యూపీ

నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి శంకుస్తాపన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ పోర్ట్ గా దీనిని నిర్మించనున్నారు. ఈ ఏయిర్ పోర్ట్ నార్త్ ఇండియాకు లాజిస్టిక్ గేట్ వేలా సేవలందిస్తుందని మోడీ చెప్పారు. ఈ ప్రాంతంలోని రైతులకు కూడా ఎక్స్ పోర్ట్ హబ్ గా ఉపయోగపడుతుందని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కు అందాల్సినవన్నీ సరిగా అందుతున్నాయని చెప్పారు. 20 ఏళ్ల క్రితం అప్పటి బీజేపీ ప్రభుత్వం ఈ ఎయిర్ పోర్ట్ కు ప్లాన్ చేయగా... కేంద్రం-యూపీ ప్రభుత్వాల మధ్య పోరుతో ఆగిపోయిందన్నారు. 

నోయిడాకు దగ్గర్లోని జేవార్ లో 1,330 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ విమానాశ్రయానికి.. మొదటి దశలో 10 వేల 500 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. నోయిడా నుంచి  40 కిలోమీటర్ల దూరంలో.. ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి 72 కిలోమీటర్ల దూరంలో ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రభుత్వం నిర్మిస్తోంది. 2024 నాటికి ఈ ప్రాజెక్టునుపూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 20 లక్షల మెట్రిక్ టన్నుల వరకు రవాణా సామర్థ్యంతో కార్గో టెర్మినల్ ఏర్పాటు చేయనున్నారు.. భవిష్యత్ లో 80 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం వరకు విస్తరించే అవకాశం ఉంది.