
మెహిదీపట్నం, వెలుగు: జియాగూడలోని శ్రీరంగనాథస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 19 నుంచి జరగనున్నాయి. 20న గరుడ ప్రసాదం, 22న శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం, 23న రథోత్సవం, 24న చక్రస్నానం ఉంటాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. 25న లక్షా25వేల పుష్పాలతో పుష్పయాగం, అర్చన, అదేరోజు సాయంత్రం మహా పూర్ణాహుతి, 108 కలశాలతో స్వామివారికి అభిషేకం, 26, 27న కలశ పూజలు కొనసాగుతాయని, 28న 1,001 కలశాలతో స్వామివారికి అభిషేకం ఉంటుందని చెప్పారు.