JIO OTT: జియో ఓటీటీ గ్రాండ్​ ఎంట్రీకి సన్నాహాలు

JIO OTT: జియో ఓటీటీ గ్రాండ్​ ఎంట్రీకి సన్నాహాలు

తక్కువ ధరలో సబ్​ స్క్రిప్షన్స్​ 

జియో ఓటీటీలోకి గ్రాండ్​ ఎంట్రీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోందని టాక్​. 4 జీ ద్వారా జియో టెలికాం రంగంలో ఎంతటి సంచలనాలు నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసవరం లేదు. దీంతో ఓటీటీలో కూడా భారీ ఆఫర్లతో ఆడియన్స్ ను ఆకట్టుకొనేందుకు సిద్ధమవుతోందని సమాచారం. ఇప్పటికే కొన్ని భారీ సినిమాలను, వెబ్​ సీరిస్​ లను కూడా రెడీ చేసుకున్నదని తెలుస్తోంది. దీంతో జియో ఓటీటీ ఎంట్రీపై భారీగా హైప్ క్రియేట్​ అయ్యింది. ప్రస్తుతం మార్కెట్​ లో ఉన్న అమెజాన్, నెట్​ ఫ్లిక్స్​, సోనిలివ్​, హాట్​ స్టార్​, జీ5 తెలుగులో ఆహా ఇంకా అనేక ఓటీటీ సంస్థలు ప్రతీ వారం వినూత్న కంటెంట్లతో ఆడియన్స్​ ను అలరిస్తున్న విషయం తెలిసిందే. వాటికి దీటుగా జియో కూడా కంటెంట్​ ను సిద్ధం చేసుకుంటోందట. ఇప్పటికే జియో సినిమా పేరుతో ఓ యాప్ ఉంది. అందులో సన్ నెక్స్ట్ కంటెంట్ కూడా షేర్ చేసేవాళ్ళు. ఇటీవలే దాన్ని విత్ డ్రా చేసుకున్నారు. ఫుట్ బాల్ వరల్డ్ కప్ జియోలోనే వచ్చింది. ఈ మధ్యే ముఖేష్ వయాకామ్ 18 స్టూడియోస్ ని కొన్నారు. వాళ్లదే వూట్ సెలెక్ట్ ప్లాట్ ఫార్మ్ ఉంది. అయితే వూట్​ ఓటీటీ పెద్దగా క్లిక్​ కాలేదు. దీంతో జియో సరికొత్తగా మరో ఓటీటీని తీసుకురాబోతున్నట్టు ముంబైలో టాక్​ వినిపిస్తోంది.