ఢిల్లీ పేలుడు..ఉగ్రవాది ఉమర్ నబీ ఇల్లు కూల్చిన భద్రతాదళాలు

ఢిల్లీ పేలుడు..ఉగ్రవాది ఉమర్ నబీ ఇల్లు కూల్చిన భద్రతాదళాలు

ఢిల్లీ ఎర్రకోట పేలుడుకు కారణమైన డాక్టర్​ ఉమర్​ నబీ ఇంటిని భద్రతాదళాలు పేల్చివేశాయి. జమ్మూకాశ్మీర్​ లోనిద క్షిణ పుల్వామాలో ఉన్న ఉమర్​నబీ ఇంటిని శుక్రవారం తెల్లవారు జామున ఆర్మీ నేలమట్టం చేసింది.  

హర్యానాలోని ఫరీదాబాద్​ లో అల్​ ఫలాహ్​ మెడికల్ కాలేజీ లో పనిచేస్తున్న ఉమర్​ నబీ ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర కారు బ్లాస్ట్​తో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. నేతాజీ  సుభాష్​ మార్గ్​ సిగ్నల్​ దగ్గర హ్యుండాయ్​ ఐ 20 కారుతో జరిపిన పేలులో 13 మంది చనిపోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం వేకువ జామున ఉమర్‌ ఇంటిని పూర్తిగా నేలమట్టం చేశారు. ఐఈడీ సాయంతో ఉమర్​ ఇంటిని పేల్చివేశారు. ఉగ్రవాదానికి మద్దతునిచ్చే వారికి ఇదో హెచ్చరికగా అధికారులు చెబుతున్నారు. ఇంతకు ముందు కూడా పహల్గాం ఉగ్రదాడి కుట్రలో పాల్గొన్న వారి ఇండ్లను కూడా బుల్డోజర్లతో కూల్చేశారు.