వికారాబాద్ ఐటీఐ క్యాంపస్ ఆవరణలోని జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసులో మార్చి 5న జాబ్ మేళా

 వికారాబాద్ ఐటీఐ క్యాంపస్ ఆవరణలోని జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసులో మార్చి 5న జాబ్ మేళా

వికారాబాద్​, వెలుగు: వికారాబాద్​ ఐటీఐ క్యాంపస్ ఆవరణలోని జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసులో ఈ నెల 5న ఉదయం10.30 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి షేక్ అబ్దుస్ సుభాన్ తెలిపారు.

హైదరాబాద్​లోని శుభ గృహ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​లో 30కి పైగా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ మేనేజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ జాబ్​కు పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీ-టెక్, ఎంబీఏ చదివిన వారు అర్హులన్నారు. వివరాలకు జాబ్ మేళా నిర్వాహకుడు మియా సాబ్ ను 9676047444 నంబర్​లో సంప్రదించాలని కోరారు.