జాబ్​ సెర్చింగ్​లో.. లోకల్​ భాషల హవా!

జాబ్​ సెర్చింగ్​లో.. లోకల్​ భాషల హవా!
  • పెరుగుతున్న జాబ్​ పోస్టింగ్​ సైట్లు
  • లోకల్​ భాషల వార్తలకూ డిమాండ్​

న్యూఢిల్లీ: జాబ్​ వేకేన్సీల సమాచారం తెలుసుకోవాలంటే ఇది వరకు అయితే ఇంగ్లీష్​ సైట్లే దిక్కు! ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ప్రతి పది మందిలో తొమ్మిది మంది సొంత భాషలో నెట్​ వాడేందుకు ఇష్టపడుతున్నారు. అందుకే తెలుగు సహా ఇతర లోకల్​ భాషల్లోనూ చాలా జాబ్​ సెర్చింగ్​ వెబ్​ సైట్లు, యాప్స్​వస్తున్నాయి. సోషల్​ మీడియాతోపాటు ఇతర కంపెనీలు లోకల్​ భాషలకు ఎక్కువ ఇంపార్టెన్స్​ ఇస్తున్నాయి. ఇంగ్లీష్​ స్థాయిలోనే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం వంటి ​ భాషల్లోనూ వార్తలు చదివే వారి సంఖ్య ఉంది. అందుకే లోకల్​ న్యూస్ ​ప్లాట్​ఫారాల సంఖ్య  పెరుగుతోంది. ఉదాహరణకు బెంగళూరుకు చెందిన హైపర్​లోకల్​ ప్లాట్​ఫారమ్​ ‘లోకల్​’ ఆరు భారతీయ భాషల్లో జాబ్ పోస్టింగ్స్​పెడుతోంది. ఇవన్నీ చిన్న బిజినెస్​ సంస్థలకు చెందినవి. తమ పోస్టింగ్స్​కు స్పందన చాలా బాగుందని లోకల్​ యాప్​ ఫౌండర్​ పాషా చెప్పారు. ఇంగ్లీష్ సైట్ల కంటే తమకు 10 రెట్లు ఎక్కువ రెస్పాన్స్​ ఉందని వివరించారు. ఒక్క పోస్టింగ్​ పెడితే గంటకు 120 కాల్స్​వస్తున్నాయని పాషా పేర్కొన్నారు.   ఇట్లాంటి ప్లాట్​ఫారాలకు నిధులు కూడా బాగా వస్తున్నాయి. 2020 అక్టోబరు వరకు లాంగ్వేజ్​ స్టార్టప్​ ఎకోసిస్టమ్​ రూ.1,600 కోట్లు రాబట్టిందని వెంచర్​ ఇంటెలిజెన్స్​ఎగ్జిక్యూటివ్​ ఒకరు వెల్లడించారు. రీజనల్​ ఫస్ట్​ యాప్స్​ చాలా మందికి (లార్జ్​ అడ్రసబుల్​ మార్కెట్​) చేరువ అవుతున్నాయని మరో మార్కెట్​ రీసెర్చ్​ ఫర్మ్​ రెడ్​సీర్​ రిపోర్టు వెల్లడించింది. ‘లోకల్’ యాప్​ తమిళం, కన్నడ, తెలుగు, మలయాళం, గుజరాతి భాషల్లో న్యూస్​, జాబ్స్​,  క్లాసిఫైడ్స్​ అందిస్తోంది. 

పెద్ద కంపెనీలు కూడా..

రీజనల్​ ఫస్ట్​ యాప్స్​కు డిమాండ్​ పెరుగుతూనే ఉందని గమనించిన బడా కంపెనీలు కూడా ఈ బిజినెస్​లో రావడానికి ఉత్సాహం చూపిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్​కు చెందిన లింక్డ్‌​ ఇన్​ గత ఏడాది హిందీ వెర్షన్​ను తేవడమే ఇందుకు నిదర్శనం. జియో ప్లాట్​ఫారమ్స్​కు చెందిన ‘న్యూస్​జే’ కూడా లోకల్​ భాషల్లో న్యూస్​ అందించడం మొదలుపెట్టింది. జీ, టైమ్స్​ ఆఫ్​ ఇండియా, హిందుస్థాన్​ టైమ్స్​, బీబీసీ సైతం  తెలుగు వెబ్​సైట్లను, యాప్స్​ను లాంచ్​ చేశాయి. ‘‘ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల మందికిపైగా హిందీ మాట్లాడేవారు ఉన్నారు. లింక్డ్‌​ ఇన్​ను హిందీలో తేవడం వల్ల మేం మరింత మందికి దగ్గరవుతాం. ఎంతో మంది ప్రొఫెషనల్స్​కు జాబ్​ పోస్టింగ్స్​ను అందుబాటులోకి తెస్తాం”అని లింక్డ్​ఇన్​ కంట్రీ మేనేజర్​ అశుతోష్​ గుప్తా చెప్పారు. నెట్​ యూజర్లలో 57 శాతం మందికిపైగా తమ మాతృభాషలో జాబ్​ పోస్టింగ్స్​ వెతకడానికి, నెట్​వర్క్​లను ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారని అప్నా డాట్​తెలిపింది. అంతేగాక 2020 మే నాటికి గ్రామీణ  భారతదేశంలో నెట్​ వాడే వారి సంఖ్య 26 కోట్లకు చేరింది. అందుకే అమెజాన్​, స్నాప్​డీల్​, ఫ్లిప్​కార్ట్​ వంటి ఆన్​లైన్​ షాపింగ్​ కంపెనీలు కూడా లోకల్​ భాషల బాట పట్టాయి. గూగుల్​ కూడా హిందీ, బెంగాలీ, మరాఠీ, తమిళం, తెలుగు భాషల్లో సెర్చ్​ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. హిందీలో సెర్చింగ్​ పది రెట్లు పెరిగిందని గూగుల్​ ప్రకటించింది. చిన్న, మధ్యస్థాయి సంస్థలు లోకల్​ భాషల్లో యాడ్స్​ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాయి.

మరిన్ని వార్తల కోసం..

శాటిలైట్​ నెట్​ మార్కెట్లోకి జియో

పేదల ఇంటి స్థలాల రెగ్యులరైజేషన్ కు మరో ఛాన్స్

కొవిడ్‌‌ మనల్ని విడిచి ఎప్పటికీ పోకపోవచ్చు