శాటిలైట్​ నెట్​ మార్కెట్లోకి జియో

శాటిలైట్​ నెట్​ మార్కెట్లోకి జియో
  • ఇందుకు ఎస్​ఈఎస్​తో జోడీ

న్యూఢిల్లీ: రిలయన్స్​గ్రూపునకు చెందిన జియో  ప్లాట్​ఫారమ్​ ఇక నుంచి శాటిలైట్ ద్వారా కూడా ఇంటర్నెట్​ సేవలు అందించనుంది. ఇందుకోసం లగ్జెంబర్గ్​కు చెందిన ఎస్ఈఎస్​తో జాయింట్​ వెంచర్​ను ఏర్పాటు చేసింది. దీనిలో జియోకు 51 శాతం, ఎస్​ఈఎస్​కు 49 శాతం వాటాలు ఉంటాయి. కొన్ని ఇంటర్నేషనల్​ ఏరోనాటికల్, మారిటైమ్​కస్టమర్లు మినహా దేశమంతటా శాటిలైట్​ డేటా, కనెక్టివిటీ సర్వీసులను అందిస్తారు. ఇంటర్నెట్​ స్పీడ్​ 100 జీబీపీఎస్​ వరకు ఉంటుందని ఈ కంపెనీలు ప్రకటించాయి. ఇందుకోసం మల్టీ ఆర్బిట్​ స్పేస్​ నెట్​వర్క్​లను వాడతారు. ఇవి మల్టీ గిగాబైట్స్​ లింకులను డెలివరీ చేయగలుగుతాయి. వీటి ద్వారా ఎంటర్​ప్రైజ్​లు, మొబైల్​ బ్యాక్​హాల్​, రిటైల్​ కస్టమర్లకు, పొరుగు దేశాలకు నెట్​ సేవలను అందించవచ్చు. ఎస్​ఈఎస్​తో ఒప్పందం వల్ల మల్టీగిగాబైట్​ బ్రాడ్​బ్యాండ్​సేవలు అందించడం సాధ్యమవుతుందని, త్వరలో 5జీ నెట్​ సేవలనూ అందుబాటులో తెస్తామని  జియో డైరెక్టర్​ ఆకాశ్ అంబానీ చెప్పారు. ​ఇదిలా ఉంటే, ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​(ఏఐ) టెక్నాలజీతో పనిచేసే లాక్​స్క్రీన్​ ప్లాట్​ఫారమ్​ ‘గ్లాన్స్’లో 200 మిలియన్​ డాలర్లు (దాదాపు రూ.1,511 కోట్లు) ఇన్వెస్ట్​ చేస్తున్నట్టు జియో ప్రకటించింది. సిరీస్‌​ డీ ఫండింగ్​గా ఈ మొత్తాన్ని అందిస్తామని తెలిపింది. ఈ ట్రాన్సాక్షన్​కు రెగ్యులేటరీ అప్రూవల్స్​ రావాల్సి ఉంది. అమెరికా, బ్రెజిల్​, మెక్సికో, రష్యా వంటి మార్కెట్లపై గ్లాన్స్​ ఫోకస్​ చేసిన నేపథ్యంలో జియో ఈ ప్రకటన చేసింది. లాక్​స్క్రీన్​పై అత్యధికంగా కంటెంట్​ఇచ్చే కంపెనీగా ఎదగాలని టార్గెట్​గా పెట్టుకున్నట్టు గ్లాన్స్​ తెలిపింది. ఈ–కామర్స్ ఎకోసిస్టమ్​ను కూడా డెవలప్​ చేస్తామని తెలిపింది. జియో నుంచి అందే డబ్బును ఇతర మార్కెట్లకు వెళ్లేందుకు ఉపయోగిస్తామని తెలిపింది.

మరిన్ని వార్తల కోసం..

మేడారం బైలెల్లిన పెండ్లికొడుకు

పేదల ఇంటి స్థలాల రెగ్యులరైజేషన్ కు మరో ఛాన్స్

సర్జికల్​ స్ట్రయిక్స్​పై కేసీఆర్ కామెంట్లు సహించం