హెచ్​పీసీఎల్​ లాభం 25శాతం డౌన్​

హెచ్​పీసీఎల్​ లాభం 25శాతం డౌన్​
  • నాలుగో క్వార్టర్​లో రూ. 2,709 కోట్ల ప్రాఫిట్‌

న్యూఢిల్లీ: హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌‌‌‌‌‌‌‌పీసీఎల్)కు మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్​లో నికరలాభం  25 శాతం తగ్గి  రూ. 2,709.31 కోట్లుగా నమోదయింది. -  గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ. 3,608.32 కోట్లు వచ్చాయి. రిఫైనింగ్​ మార్జిన్లు పడిపోవడంతో లాభం తక్కువగా వచ్చిందని తెలిపింది. ప్రతి రెండు షేర్లకు ఒక ఉచిత బోనస్ షేర్‌‌‌‌‌‌‌‌ను ప్రకటించింది. ఈ క్వార్టర్​లో ప్రతి బ్యారెల్ ముడి చమురును ఇంధనంగా మార్చడం ద్వారా సంస్థ  6.95 డాలర్లు సంపాదించింది. 

ఒక సంవత్సరం క్రితం బ్యారెల్ గ్రాస్​ రిఫైనింగ్ మార్జిన్‌‌‌‌‌‌‌‌కు  14.01 డాలర్లు ఉండగా,  మునుపటి క్వార్టర్​లో బ్యారెల్ మార్జిన్‌‌‌‌‌‌‌‌కు  8.50 డాలర్లు వచ్చాయి. పెట్రోల్,  డీజిల్ ధరలు లీటరుకు రూ. 2 చొప్పున తగ్గించినందున దాని నికర లాభం కూడా తక్కువగా ఉంది.  అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో మార్కెటింగ్ మార్జిన్లు తగ్గుముఖం పట్టాయి.  2023–-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి హెచ్​పీసీఎల్​ రికార్డు స్థాయిలో రూ. 16,014.61 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత సంవత్సరంలో రూ. 6,980.23 కోట్ల నష్టం వచ్చింది.