భూమి ఇచ్చే ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలి: కేటీఆర్

భూమి ఇచ్చే ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలి: కేటీఆర్

స్థానికుల సహకారంతో ఫార్మాసిటీ పనులు స్పీడ్ గా ముందుకు దూస్కెళ్తున్నాయన్నారు మంత్రి కేటీఆర్ . ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ గా హైదరాబాద్ ఫార్మా సిటీ రూపుదిద్దుకుంటోందన్నారు. ఫార్మాసిటీలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రగతిభవన్ లో ఫార్మాసిటీపై సమీక్షా సమావేశం జరిగింది.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

స్థానికుల ప్రయోజనాలకు ప్రాధాన్యత కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి కేటీఆర్. ఫార్మా సిటీ కోసం భూములు ఇస్తున్న ప్రతి కుటుంబంలో కనీసం ఒకరికి ఉద్యోగం వచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ అంశానికి సంబంధించి ఇప్పటి నుంచే కసరత్తును ప్రారంభించాలని సూచించారు. ప్రభావిత కుటుంబాలకు సంబంధించి లిస్టును తయారు చేయాలని… కుటుంబ సభ్యుల విద్యార్హతలు, ఇతర టెక్నికల్ అర్హతలను మ్యాపింగ్ చేయాలని చెప్పారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ తో పాటు, ఇతర శిక్షణా సంస్థల సహకారంతో ప్రణాళికలు రూపొందిచాలన్నారు మంత్రి కేటీఆర్ .