
హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనో, టైపిస్ట్ ఉద్యోగాలను టీఎస్‌పీఎస్పీ గ్రూప్ -4 ద్వారానే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం డిపార్ట్మెంట్ ఈఎన్సీ(అడ్మిన్) అనిల్ కుమార్ సర్క్యులర్ జారీ చేశారు. ఈ కేటగిరీలోని పోస్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ డిపెండెంట్, కారుణ్య నియామకాల ద్వారా భర్తీ చేయరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పోస్టులన్నీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారానే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ మేరకు టెరిటోరియల్ ఈఎన్సీలు, సీఈలు చర్యలు చేపట్టాలని తెలిపారు.