ములుగు, వెలుగు : స్టూడెంట్లు రికమండేషన్ తో కాకుండా స్కిల్స్ ఆధారంగానే ఉద్యోగాలు సాధించాలని ఐఐటీ-హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్.మూర్తి, టిస్ -హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ అసీమ్ ప్రకాశ్ చెప్పారు. ములుగు మండలం జాకారంలోని సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో వీసీ వైఎల్శ్రీనివాస్అధ్యక్షతన గురువారం ఇంట్రడక్షన్ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ బీఎస్ మూర్తి వర్చువల్ గా మాట్లాడుతూ.. ములుగు యూనివర్సిటీలో అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలని, స్టూడెంట్లు సరికొత్త ఆలోచనలతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ అసీమ్ ప్రకాశ్ మాట్లాడుతూ.. స్టూడెంట్లు పోటీ ప్రపంచంలో రాణించేందుకు క్రమశిక్షణ, ప్రణాళికాబద్ధమైన చదువుపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో అకాడమిక్ డీన్ ప్రొఫెసర్ రాంరెడ్డి పాల్గొన్నారు.
