Joe Burns: ఇటలీ తరుపున ఆడనున్న ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్

Joe Burns: ఇటలీ తరుపున ఆడనున్న ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్

క్రికెటర్లు కమర్షియల్ గా మారిపోతున్నారు. సొంత జట్టులో చోటు లభించకపోతే వేరే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అమెరికా, నెదర్లాండ్స్ జట్టులో ఎక్కువ మంది భారత సంతతికి చెందిన క్రికెటర్లే కనిపిస్తారు. ఇటీవలే తాజాగా న్యూజీలాండ్ మాజీ ఆల్ రౌండర్ అమెరికా జట్టులో చేరి షాక్ కు గురి చేశాడు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ జో బర్న్స్ ఇటలీ తరపున ఆడేందుకు సిద్ధమయ్యాడు. 

బర్న్స్ సోదరుడు డొమినిక్ కూడా క్రికెటర్. అతని ఈ ఏడాది ఫిబ్రవరిలో కన్నుమూశారు. తన దివంగత సోదరుడికి నివాళిగా ఇటలీ కోసం ఆడాలనే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 2026 T20 ప్రపంచ కప్‌కు అర్హత సాధించాలనే లక్ష్యంతో బర్న్స్ ఆడబోతున్నట్టు తెలియజేశాడు. బర్న్స్ తల్లి ఇటాలియన్ కు చెందింది. అందుకే అతను ఇటలీకి ఆడనున్నట్లు తెలుస్తుంది. సోదరుడు డొమినిక్  బ్రిస్బేన్‌లో క్లబ్ క్రికెట్ ఆడుతున్నప్పుడు 85 నంబర్ జెర్సీని ధరించేవాడు. బర్న్స్ సైతం తన సోదరుడి 85 నంబర్ జెర్సీని ధరించనున్నట్లు తెలిపాడు.   

2024-25 లో క్వీన్స్‌ల్యాండ్ కాంట్రాక్ట్ జాబితా నుండి బర్న్స్ తొలగించబడిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇటలీ జూన్ 9 నుంచి  16 మధ్య ఫ్రాన్స్, ఐల్ ఆఫ్ మ్యాన్, లక్సెంబర్గ్,టర్కియేలతో క్వాలిఫైయింగ్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. 2014, 2020 మధ్య ఆస్ట్రేలియా తరపున 23 టెస్టులు ఆడిన ఈ 34 ఏళ్ళ ఆటగాడు.. 36 యావరేజ్ తో 1442 పరుగులు చేశాడు. 6 వన్డేల్లో 24 యావరేజ్ తో 146 పరుగులు చేశాడు.