జో రూట్ 10,000 పరుగులు

జో రూట్ 10,000 పరుగులు

ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ జో రూట్ అరుదైన మైలురాయిని అందుకున్నాడు... టెస్ట్ క్రికెట్‌లో 10,000 పరుగులు పూర్తి చేశాడు.. ఈ ఘనతను సాధించిన రెండవ ఇంగ్లీష్ ఆటగాడిగా నిలిచాడు.. ప్రపంచవ్యాప్తంగా పదివేల టెస్టు పరుగులు పూర్తి చేసిన 14వ ఆటగాడు రూట్ కావడం విశేషం.

ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య లార్డ్స్‌లో జరుగుతున్న తొలి టెస్టులో రూట్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. రూట్ కంటే ముందుగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ 10,000 పరుగులు పూర్తి చేశాడు. అతను 161 టెస్టుల్లో 45.35 సగటుతో 12,472 పరుగులు చేశాడు. ఇందులో  33 సెంచరీలు మరియు 57 అర్ధ సెంచరీలున్నాయి.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే... 277 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీనితో సిరీస్ లో 1-0తో ముందంజలో ఉంది. 

 

మరిన్ని వార్తల కోసం.. 

ఎవరి మతపరమైన భావాలను దెబ్బతీయడం నా ఉద్దేశ్యం కాదు

‘మిషన్ భగీరథ’ మీదని ప్రచారం చేసుకుంటారా ?